Xerox copies of Rs.2000: నకిలీ రూ. 2 వేల నోట్లు ఏటీఎంలో జమ; జిరాక్స్‌ తీసి తన భార్య ఖాతాతో డిపాజిట్

|

Jun 26, 2021 | 10:24 AM

ఏటీఎం లలో లోపాన్ని ఓ వ్యక్తి ఆసరాగా చేసుకుని మోసం చేశాడు. రూ. 2వేల నోట్లను జిరాక్స్ తీసి ఏకంగా తన భార్య ఖాతాలో జమ చేసి అడ్డంగా దొరికిపోయాడు.

Xerox copies of Rs.2000: నకిలీ రూ. 2 వేల నోట్లు ఏటీఎంలో జమ; జిరాక్స్‌ తీసి తన భార్య ఖాతాతో డిపాజిట్
Fake Notes
Follow us on

Xerox copies of Rs.2000: ఏటీఎం లలో లోపాన్ని ఓ వ్యక్తి ఆసరాగా చేసుకుని మోసం చేశాడు. రూ. 2వేల నోట్లను జిరాక్స్ తీసి ఏకంగా తన భార్య ఖాతాలో జమ చేసి అడ్డంగా దొరికిపోయాడు. పుదుకోటై జిల్లా అరంతాంగిలో జరిగిన ఈ సంఘటన బ్యాంక్ అధికారులను షాక్‌కు గురిచేంసింది. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం డిపాజిట్ మెషిన్‌ వచ్చిన ఓ వ్యక్తి, అప్పటికే కలర్ జిరాక్స్ తీసి తనవద్ద ఉంచుకున్న నకిలీ రూ.2వేల నోట్లను జమ చేశాడు. అనంతరం డిపాజిట్ మెషిన్‌ను అధికారులు తనిఖీ చేయగా, అసలు విషయం బయటకు వచ్చింది.

సీసీ పుటేజీ ఆధారంగా ఆ వ్యక్తి ని పోలీసులు గుర్తించారు. ఈమేరకు శరవణన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు అతను తన భార్య రేవతి ఖాతాలో జిరాక్స్‌ నోట్లతో మొత్తం రూ.60 వేలు డిపాజిట్‌ చేసినట్లు తెలిపాడు. డిపాజిట్ చేసిన కొద్దిసేపటి తరువాత మరో ఏటీఎం నుంచి నగదు విత్‌ డ్రా చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరంతంగి సమీపంలోని కంబన్‌కుడికి చెందిన శరవణన్(34), రవిచంద్రన్‌(41) అనే ఇద్దరిని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు.

ఒమన్‌లో ఉద్యోగం చేస్తున్న రవిచంద్రన్ ఫిబ్రవరిలో ఇండియాకు తిరిగి వచ్చాడు. కోవిడ్ -19 తో లాక్‌డౌన్‌లో పని దొరకలేదు. దీంతో రవిచంద్రన్ తన బంధువు శరవణన్ తో కలిసి నెట్‌లో ‘డబ్బును రెట్టింపు చేయడం ఎలా’ పై వీడియోలు చూస్తూ.. ఈ మేరకు రూ.2వేల నోటును ఎంచుకున్నారు. రూ. 60 వేల నకిలీ నోట్లను తయారుచేశాడు. అయితే వీటిని ఏటీఎంలో డిపాజిట్ చేసిన తరువాత రసీదు మాత్రం రాలేదు. దీంతో శరవణన్ బ్రాంచ్ మేనేజర్‌ను సంప్రదించాడు. ఈమేరకు వాటిని పరిశీలించిన బ్రాంచ్ మేనేజర్ నకిలీ రూ.2వేల నోట్లుగా గుర్తించాడు. దీంతో అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read:

Poice Rides : జయ గ్రాండ్ హోటల్‌పై పోలీసులు దాడి.. వ్యభిచారం చేస్తున్నారంటూ ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు అరెస్ట్

EGS : ఉపాది హామీ కూలీల దగ్గర లంచం తీసుకుంటూ వీడియో రికార్డింగ్‌లో దొరికిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్

Farmers Protest: రైతుల నిరసనను తప్పుదారి పట్టించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరిక..