సాగర్ రానా హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కుమార్ కు పెద్ద దెబ్బ !..ప్రభుత్వ అప్రూవర్ గా మారనున్న సన్నిహితుడు ప్రిన్స్

| Edited By: Phani CH

May 29, 2021 | 2:26 PM

రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ కు అత్యంత సన్నిహితుడు ప్రిన్స్ ప్రభుత్వ అప్రూవర్ గా మారనున్నాడు.

సాగర్ రానా హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కుమార్ కు పెద్ద దెబ్బ !..ప్రభుత్వ అప్రూవర్ గా మారనున్న సన్నిహితుడు ప్రిన్స్
Sushil Kumar
Follow us on

రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ కు అత్యంత సన్నిహితుడు ప్రిన్స్ ప్రభుత్వ అప్రూవర్ గా మారనున్నాడు. ఇది సుశీల్ కి పెద్ద దెబ్బ ! ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద ఈ నెల 4 న జరిగిన ఘర్షణ సందర్భంగా ప్రిన్స్ అక్కడే ఉన్నాడని పోలీసులు చెప్పారు. ఈ కేసులో అప్రూవర్ గా మారేందుకు అతడు అంగీకరించాడని వారు తెలిపారు. ఆ రోజున ఈ స్టేడియం పార్కింగ్ స్థలం వద్ద సుశీల్ కుమార్ తో బాటు ఇతని సన్నిహితులైన అజయ్ కుమార్, ప్రిన్స్, మరికొందరు..సాగర్ రాణాపైన, మరికొందరిపైనా దాడి చేశారని వారు పేర్కొన్నారు. తాను ముఖ్యంగా రానామీద ఎటాక్ చేస్తుండగా వీడియో తీయాలని, తద్వారా ఇతరులు ఇది చూసి భయపడతారని సుశీల్ కుమార్..ప్రిన్స్ తో చెప్పినట్టు ఖాకీలు వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు. ఈ దాడికి తాను కూడా పాల్పడ్డానని బిందర్ అనే వ్యక్తి తెలిపాడు. ఢిల్లీలోని తిక్రి గ్రామానికి చెందిన ఇతడిని విజేందర్ అని కూడా వ్యవహరిస్తారని ఖాకీలు చెప్పారు. సుశీల్ ఆదేశాలపై తాము రానాను కొట్టినట్టు ఇతడు అంగీకరించాడు. రానా మర్డర్ కేసులో మొత్తం 12 మంది నిందితులని, వీరిలో 9 మంది అరెస్టయ్యారని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న ప్రవీణ్, ప్రదీప్, వినోద్ ప్రధాన్ అనే ముగ్గురికోసం గాలిస్తున్నామన్నారు.

సుశీల్ కుమార్ ని ఢిల్లీ పోలీసులు ఈ నెల 23 న అరెస్టు చేశారు. ఇతడిని ఆరు రోజుల పోలీస్ కస్టడీకి ఢిల్లీకోర్టు అనుమతించింది. తన సన్నిహితుడే అప్రూవర్ గా మారతాడని సుశీల్ కుమార్ ఏ మాత్రం ఊహించలేదని పోలీసులు పేర్కొన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: River: ఇండియాలో సముద్రంలో కలవని ఏకైక జీవనది ఇదే..! నీరు ఒక దగ్గర తియ్యగా మరో దగ్గర ఉప్పగా..? ( వీడియో )

Viral Video: అనంతపురంలో వింత ఆచారం.. వేంకటేశ్వరునికి బాలికతో మొదటి వివాహం.. ( వీడియో )