తిరుగుబాటు ఎమ్మెల్యేలకు యెడియూరప్ప భరోసా కల్పిస్తారా?

| Edited By:

Aug 24, 2019 | 6:04 PM

కర్నాటకలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ – కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోడానికి కారణమై అనర్హత వేటు వేయబడ్డ రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతుగా నిలిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయనను పదిమంది ఎమ్మెల్యేలు అక్కడ కలిశారనే వార్తలు గుప్పుమన్నాయి. రాష్ట్రంలో కురిసిన వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పరిస్థితిని వివరించేందుకు యెడియూరప్ప ఢిల్లీకి వచ్చారు. అయితే అప్పటికే వేటు వేయబడ్డ ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీకి చెందిన ఒక సీనియర్ […]

తిరుగుబాటు ఎమ్మెల్యేలకు యెడియూరప్ప భరోసా కల్పిస్తారా?
Follow us on

కర్నాటకలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ – కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోడానికి కారణమై అనర్హత వేటు వేయబడ్డ రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతుగా నిలిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయనను పదిమంది ఎమ్మెల్యేలు అక్కడ కలిశారనే వార్తలు గుప్పుమన్నాయి. రాష్ట్రంలో కురిసిన వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పరిస్థితిని వివరించేందుకు యెడియూరప్ప ఢిల్లీకి వచ్చారు. అయితే అప్పటికే వేటు వేయబడ్డ ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి చేరుకున్నారు.

బీజేపీకి చెందిన ఒక సీనియర్ నేత మాట్లాడుతూ అనర్హత వేటు వేయబడ్డ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు విషయంలో బీజేపీ అధిష్టానం మౌనంగా ఉన్న మాట వాస్తమేనని, వారంతా ముఖ్యమంత్రి యెడియూరప్పతో భేటీ కావాలని ప్రయత్నాలు చేసిన విషయం వాస్తవమేనని చెప్పారు. అయితే సుప్రీం కోర్టులో ఉన్న తమ కేసు విచారణ నిమిత్తం తామంతా ఢిల్లీకి వచ్చామని రెబల్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. జాతీయ మీడియాతో జేడీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎహెచ్ విశ్వనాథ్ మాట్లాడుతూ యెడియూరప్ప కుమారుడు బి.వై. విజేంద్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలిశారనే వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. తాము హోం మంత్రి అమిత్‌తో సమావేశం కావాలని ప్రయత్నాలు చేసినట్టు వస్తున్నవార్త పూర్తిగా నిరాధరమని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మంగళవారం కర్నాటక మంత్రి వర్గంలో చేరిన 17మంది మంత్రులకు సంబంధించి నియామక పత్రాలు అందకపోవడంతో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రానికి కూడా వారి విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు.