Crime: భర్త చనిపోయిన బాధ లేకుండా.. ఆరుగురు పిల్లలను వదిలేసి.. ఆ మహిళ ఏం చేసిందంటే

|

Apr 17, 2022 | 6:35 AM

భర్త చనిపోయిన ఇంటికి ఆసరాగా ఉండాల్సిన ఆ మహిళ దురాగతానికి పాల్పడింది. ఆరుగురు పిల్లలను వదిలేసి ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆరుగురు పిల్లలూ అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న...

Crime: భర్త చనిపోయిన బాధ లేకుండా.. ఆరుగురు పిల్లలను వదిలేసి.. ఆ మహిళ ఏం చేసిందంటే
Woman Escape
Follow us on

భర్త చనిపోయిన ఇంటికి ఆసరాగా ఉండాల్సిన ఆ మహిళ దురాగతానికి పాల్పడింది. ఆరుగురు పిల్లలను వదిలేసి ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆరుగురు పిల్లలూ అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్(Madya Pradesh) లోని విదిశా జిల్లా శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో రాణి అహిర్వార్‌(30) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివాసముంటోంది. ఆమెకు భర్తతో మనస్పర్థలు రావడంతో అతను వాటర్‌ ట్యాంక్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి రాణి తన ఆరుగురి పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఇదే సమయంలో రాణికి ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ కలిసి పారిపోయేందుకు నిర్ణయించారు. ఆ తర్వాత రాణి తన ఆరుగురు పిల్లలను ఇంటి దగ్గర వదిలేసి ఎదురింట్లోనే ఉన్న ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న బంధువులు.. అనాథలైన ఆ పిల్లలను తీసుకుని శంషాబాద్‌ పోలీసుస్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.

రాణి భర్త చనిపోవడం వల్ల ఆమెకు రూ.15 లక్షల పరిహారం అందనుంది. అందుకోసం బంధువులు.. రాణి బ్యాంకు ఖాతాను రద్దు చేయాలని, ఆ డబ్బులు పిల్లలకు అందేటట్లుగా చూడాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read

Minister KTR: తెలంగాణ ఐటీ హబ్‌పై కేంద్రం తీవ్ర వివక్ష.. మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

DC vs RCB Score: దంచికొట్టిన దినేశ్‌ కార్తీక్‌.. రాణించిన మ్యాక్సీ.. ఢిల్లీ టార్గెట్‌ ఎంతంటే..

TRS Foundation Day: ఏప్రిల్ 27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం.. హెచ్ఐసీసీ సభకు భారీగా ఏర్పాట్లు