మరీ ఇంత దారుణమా.. అత్తను దోశపెంకతో కొట్టి చంపిన కోడలు.. అసలేం జరిగిందంటే

ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న అత్తను కోడలు హత్య చేసిన ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే కోల్‌కతాకు చెందిన సుర్జీత్ సామ్ (51) ష‌ర్మిష్ఠ సామ్(48) అనే దంప‌తులు త‌మ కూతురు(16)తో క‌లిసి ఢిల్లీలోని నెబ్ స‌రాయి ప్రాంతంలో 2014 నుంచి నివాస‌ముంటున్నారు.

మరీ ఇంత దారుణమా.. అత్తను దోశపెంకతో కొట్టి చంపిన కోడలు.. అసలేం జరిగిందంటే
Death

Updated on: May 10, 2023 | 1:10 PM

ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న అత్తను కోడలు హత్య చేసిన ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే కోల్‌కతాకు చెందిన సుర్జీత్ సామ్ (51) ష‌ర్మిష్ఠ సామ్(48) అనే దంప‌తులు త‌మ కూతురు(16)తో క‌లిసి ఢిల్లీలోని నెబ్ స‌రాయి ప్రాంతంలో 2014 నుంచి నివాస‌ముంటున్నారు. అయితే సుర్జీత్ త‌ల్లి హసి సోమ్ (86) కోల్‌క‌తాలోనే ఉంటుంది. అయితే అతని త‌ల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావ‌డంతో.. 2022లో ఢిల్లీకి తీసుకొచ్చి, త‌న ఇంటి ముందే ఓ కిరాయి గ‌దిలో త‌ల్లిని ఉంచాడు సుర్జీత్. అయితే కొంత కాలంగా ఆమె కీళ్లనొప్పులతో బాధపడుతుంది. ఆమెకు సేవ చేయడంలో కొడలు ఇబ్బంది పడేది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 28న ఉదయం 10.30 గంటలకు అత్త ఉంటున్న గదిలోకి వెళ్లింది కొడలు. తన చేతిలో ఉన్న దోశ పెంకతో అత్తపై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ వృద్ధురాలు అక్కడిక్కడే కుప్పకూలిపోయింది.

ఏప్రిల్‌ 29న సుర్జిత్‌ స్నేహితుడు హసి సోమ్‌ను కలవడానికి ఆ ప్లాట్‌కు వెళ్లాడు. ఆమె బెడ్‌రూంలో కనిపించకపోవటంతో ఇల్లు మొత్తం వెతికాడు. చివరికి వంటగదిలోకి వెళ్లి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే సుర్జిత్‌కు సమాచారం అందించగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెకు తీవ్రంగా గాయం కావడంతో అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించగా ఆమె శరీరంపై 14 గాయాలు ఉన్నట్లు తేల్చారు. తల్లి అంత్యక్రియల అనంతరం సుర్జిత్‌ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు. అందులో తన భార్య ఒక వంటపాత్రను తీసుకొని తల్లి వద్దకు వెళ్లటం చూశాడు. ఈ ఆధారంతో అతడు తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేయంతో వాళ్లు ఆమెను అరెస్టు చేశారు. అత్తకి సేవ చేయడం ఇష్టం లేకే కోడలు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు కారణం విచారణ తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..