Watch: విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ.. షాకింగ్‌ వీడియో చూస్తే..

అవును మీరు విన్నది నిజమే.. స్పైస్‌జెట్ విమానం గాల్లో ఉండగా, కిటికీ తెరుచుకోవటం గందరగోళానికి దారి తీసింది. గోవా నుంచి పుణే వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. స్పైస్‌జెట్ విమానం SG1080 లో పెద్ద ప్రమాదం తప్పింది. ఫ్లైట్ గగనతనంలో ఉండగా కిటికీ సగం తెరుచుకున్నట్లు ప్రయాణికులు గమనించారు.

Watch: విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ.. షాకింగ్‌ వీడియో చూస్తే..
Spicejet Flight

Updated on: Jul 03, 2025 | 8:05 AM

విమానయాన పరిశ్రమ సంక్షోభంలో ఉంది. విమానంలో ప్రయాణించే వారిని ఇప్పుడు ఆ దేవుడో రక్షించాలి అన్నట్టుగా కనిపిస్తున్నాయి పరిస్థితులు. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రమాదాల నేపథ్యంలో ఇప్పుడు స్పైస్‌జెట్ విమానం కూడా అదే దోవలోకి వచ్చిందనే ఘటన వెలుగులోకి వచ్చింది. అవును, స్పైస్‌జెట్ విమానంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది ప్రయాణికులందరినీ భయబ్రాంతులకు గురిచేసింది. ఒక ప్రయాణీకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కిటికీ తెరుచుకున్న వీడియోను పోస్ట్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

అవును మీరు విన్నది నిజమే.. స్పైస్‌జెట్ విమానం గాల్లో ఉండగా, కిటికీ తెరుచుకోవటం గందరగోళానికి దారి తీసింది. గోవా నుంచి పుణే వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. స్పైస్‌జెట్ విమానం SG1080 లో పెద్ద ప్రమాదం తప్పింది. ఫ్లైట్ గగనతనంలో ఉండగా కిటికీ సగం తెరుచుకున్నట్లు ప్రయాణికులు గమనించారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదని, ల్యాండ్ అయిన తర్వాత సమస్యను పరిష్కరించామని సంస్థ స్పష్టం చేసింది. సిబ్బంది సరిగా పరిశీలించకపోవడం వల్లే ఇలా జరిగిందని ప్యాసింజర్లు విమర్శలు చేశారు. ఈ ఘటనపై విమాన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

ఈ సంఘటన మంగళవారం స్పైస్‌జెట్ Q400 విమానంలో జరిగింది. విమానం గాల్లోకి ఎగిరినప్పుడు ఒక ప్రయాణీకుడు అకస్మాత్తుగా కిటికీ ఫ్రేమ్ వదులుగా మారడాన్ని చూసి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో విమానం లోపల ఉన్న కిటికీ ఫ్రేమ్ బయటికి కదులుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..