Windfall profit tax: విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ ను సవరించిన కేంద్రప్రభుత్వం.. డీజిల్ పై పెరిగిన ఎగుమతి పన్ను..

|

Sep 01, 2022 | 1:35 PM

ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ ను కేంద్ర ప్రభుత్వం వరుసగా నాలుగోసారి సవరించింది. లీటర్‌ డీజిల్‌పై ఎగుమతి పన్నును రూ.7 నుంచి రూ.13.50కు పెంచింది. దీంతో ఒక్కసారి..

Windfall profit tax: విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ ను సవరించిన కేంద్రప్రభుత్వం.. డీజిల్ పై పెరిగిన ఎగుమతి పన్ను..
Petrol, Disel Pump
Follow us on

Windfall profit tax: ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ ను కేంద్ర ప్రభుత్వం వరుసగా నాలుగోసారి సవరించింది. లీటర్‌ డీజిల్‌పై ఎగుమతి పన్నును రూ.7 నుంచి రూ.13.50కు పెంచింది. దీంతో ఒక్కసారి రూ.6.50 పెరిగింది. విమానం ఇంధనం ఏటీఎఫ్‌ ఎగుమతిపై రూ.2 నుంచి రూ.9కి సవరించింది. కొత్త పన్నులు ఈరోజు నుంచి అంటే సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధిస్తున్న ప్రత్యేక పన్నును టన్నుపై రూ.13,000 నుంచి రూ.13,300కు పెంచింది. ఎగుమతులపై లాభాలు పెరిగిన కారణంగానే పన్నును సవరించామని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఒపెక్‌ చమురు ఉత్పత్తి తగ్గించే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ధరలు పెరిగే అవకాశం ఉందని.. అందుకే దేశీయ చమురు ఉత్పత్తిపై కూడా పన్నును పెంచామని కేంద్రం తెలిపింది.

అంతర్జాతీయంగా పెరిగిన ధరల కారణంగా చమురు శుద్ధి సంస్థలు పొందుతున్న లాభాల నుంచి ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం జులై 1న తొలిసారి విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ పన్నును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ధరలు దిగిరావడంతో ప్రతి 15 రోజులకొకసారి సవరిస్తూ వస్తోంది. ఈరోజు ఉదయం నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 105 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సరిగ్గా 15 రోజుల క్రితం ఇది 95 డాలర్లుగా ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం పన్నులను సవరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..