‘500 గంటలైనా వేచి ఉంటా!’, రాహుల్ గాంధీ

రైతు చట్టాలకు నిరసనగా  మంగళవారం హర్యానాలో జరగనున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రాష్ట్ర సరిహద్దులకు చేరుకున్నారు. అయితే పెద్ద సంఖ్యలో..

500 గంటలైనా వేచి ఉంటా!, రాహుల్ గాంధీ

Edited By:

Updated on: Oct 06, 2020 | 6:16 PM

రైతు చట్టాలకు నిరసనగా  మంగళవారం హర్యానాలో జరగనున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రాష్ట్ర సరిహద్దులకు చేరుకున్నారు. అయితే పెద్ద సంఖ్యలో ఉన్న పోలీసులు ఆయన కాన్వాయ్ ని నిలిపివేశారు. దీనిపై స్పందించిన రాహుల్..తాను గంట కాదు, రెండు గంటలు కాదు, 500 గంటలైనా ఇక్కడే సంతోషంగా వేచి ఉంటా అని వ్యాఖ్యానించారు. చివరకు గంటలోగానే ఆయనకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. పంజాబ్ లో మాదిరే ఈ రాష్ట్రంలోనూ జరిగే ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్ పాల్గొంటున్నారు. ఆయనతో బాటు వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు…. పోలీసుల బ్యారికేడ్లను ఛేదించుకుని ముందుకు కదిలారు.