ఆ ప్రబుద్ధుడు పేరుకు చదువుకున్నాడు. ఇంజనీర్‌గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కానీ అతని బుద్ధి మాత్రం వంకర. కట్నం ఇస్తేనే ఫస్ట్ నైట్ లేదంటే లేదంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. దీంతో విసిగిపోయిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అవినాశ్ వర్మ అనే వ్యక్తి ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 2022లో ఓ మహిళతో వివాహమైంది. వివాహం సమయంలో ఎలాంటి కట్నం, లాంఛనాలు అవసరం లేదని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాతే అవినాశ్ అసలు రూపం బయటపడింది. కట్నం తీసుకురావాలని భార్యను వేధించడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె పేరెంట్స్‌ను సైతం వేధిస్తూ వచ్చాడు. చివరికి కట్నం తెస్తేనే మొదటి రాత్రి అంటూ వంకరబుద్ధిని చూపెట్టాడు.
దీంతో విసిగెత్తి పోయిన భార్య అవినాశ్ వర్మపై బసవనగుడి మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. అవినాశ్ వర్మతో తనకు 2022 జూన్ 6న వివాహమైందని, వివాహం సమయంలో కట్నం అవసరం లేదని చెప్పి, ఇప్పుడు తనను, తన తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టారని ఫిర్యాదు చేసింది. వేధింపులు తట్టుకోలేక అవినాశ్‌కు తన పేరెంట్స్.. రూ.5.8 లక్షలు ఇచ్చారని తెలిపింది. మిగిలిన నగదు ఇస్తేనే మొదటి రాత్రి అని, ఇవ్వకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పుకొచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..