Prashant Kishor: నితీశ్ కుమార్‌తో బీజేపీకి లాభం లేదు.. ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ ఎన్డీఏ కూటమిలో చేరడంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీయూ తిరిగి ఎన్‌డీఏలోకి తీసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన లాభం లేదన్నారు. బీహార్ నుండి బీజేపీ సీట్లలో పెద్ద తేడా ఉండకపోవచ్చన్నారు. అయితే ఇది ప్రతిపక్ష కూటమికి మాత్రం పెద్ద దెబ్బ అని అభిప్రాయపడ్డారు.

Prashant Kishor: నితీశ్ కుమార్‌తో బీజేపీకి లాభం లేదు.. ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
Prashant Kishor Nitish Kumar

Updated on: Feb 02, 2024 | 4:53 PM

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ ఎన్డీఏ కూటమిలో చేరడంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీయూ తిరిగి ఎన్‌డీఏలోకి తీసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన లాభం లేదన్నారు. బీహార్ నుండి బీజేపీ సీట్లలో పెద్ద తేడా ఉండకపోవచ్చన్నారు. అయితే ఇది ప్రతిపక్ష కూటమికి మాత్రం పెద్ద దెబ్బని అభిప్రాయపడ్డారు. ఇక, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా భారత కూటమి ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహారించారు నితీశ్ కుమార్. అలాంటి నితీష్ కుమార్‌ను ఎన్డీఏలోకి తీసుకుంటే, బీజేపీకి ఓటమి తప్పదన్నారు వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ బీజేపీ సీట్లు తగ్గిస్తారని, ఆ విషయం బీజేపీకి తెలుసునని ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు.

ఒకసారి బీజేపీ.. మరోసారి కాంగ్రెస్ కూటమి.. ఇలా 2013 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు NDAలో చేరిన నితీష్ కుమార్‌.. మళ్లీ ఇప్పుడు అదే కూటమికి దగ్గరయ్యారు. 2014లో నితీష్ కుమార్ బీజేపీతో 15 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్‌తో చేతులు కలిపారు. ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించింది. దీంతో నితీష్ మళ్లీ సీఎం కుర్చీ దక్కించుకున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఒక ప్రధాన రాజకీయ పరిణామంలో, గత ఏడాది బీజేపీని ఐక్యంగా పోరాడేందుకు ప్రతిపక్ష పార్టీలకు నాయకత్వం వహించిన నితీష్ కుమార్ భారత కూటమిని విడిచిపెట్టి NDAలో చేరారు. అనేక సందర్భాల్లో ఒకరినొకరు దూషించుకున్నప్పటికీ, JDU – BJP జత కలిశాయి. అయితే నితీష్ కుమార్ కూటమి నుండి నిష్క్రమించడం మొత్తం కూటమికి హాని కలిగించదని కాంగ్రెస్ పేర్కొంది. 2024 నాటికి జేడీయూ పని అయిపోతుందని, 2025లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేలోపు బీహార్‌లో మళ్లీ సమీకరణాలు మారుతాయని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో జేడీయూ ఎవరితో కలిసి పోటీ చేసినా పర్వాలేదు. 20 సీట్లకు మించి గెలవలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

అంతేకాడు భారత్ జోడో న్యాయ్ యాత్రకు రాహుల్ గాంధీ సమయం తప్పు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇప్పుడు అతను హెడ్‌క్వార్టర్స్‌లో ఉండాలని, గ్రౌండ్‌లో ఉండాల్సి వచ్చిన్నప్పుడు, రాహుల్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటాడని, హెడ్‌క్వార్టర్స్‌లో అవసరమైనప్పుడు, యాత్రలో ఉంటాడని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో రాహుల్ గాంధీ సమయపాలన తెలియని వ్యక్తిగా అభివర్ణించారు ప్రశాంత్ కిషోర్. ఇందులో భాగంగానే ఇండియా కూటమి సీట్ల పంపకాలకు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండగా, చాలా ఆలస్యంగా అమలులోకి వచ్చినందున ఇండియా కూటమిలో పలు సమస్యలను ఎదుర్కొంటోందన్నారు.

రామమందిరంతో బీజేపీకి పెద్దగా కొత్త ఓట్లు పెరగవని, ఓట్లను ఏకీకృతం చేస్తుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఓట్లు ప్రధాని మోదీకే పడతాయని ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. నరేంద్ర మోదీ చరిస్మాతోనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశముందన్నారు ప్రశాంత్ కిశోర్. ప్రతి ఐదేళ్లకోసారి మోదీ కొత్త పంథాతో ఎన్నికలకు వెళ్తున్నట్లు గుర్తు చేశారు. 2002 లో హిందూ హృదయ సామ్రాట్‌గా మోదీ జనంలోకి వచ్చారు. 2007 నాటికి, గుజరాత్‌లో అభివృద్ధిని తీసుకురాగల సమర్థుడైన పరిపాలకుడుగా మారారు. 2014 నాటికి, భారతదేశాన్ని మార్చగల వ్యక్తిగా ఎదిగారు. 2019 నాటికీ భారతదేశ సంస్కృతికి గొప్ప గర్వం, ధైర్యం, నమ్మకం కలిగించగల వ్యక్తి అయ్యారు. 2024 లో అతను దేశానికి రాముడిని తీసుకువచ్చిన వ్యక్తిగా నిలిచారు. BJP చేసే ప్రతి పని మోదీ బ్రాండింగ్‌కు లోబడి ఉంది. ఆయన బీజేపీకి చెందిన మరో ఇందిరా గాంధీ’’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..