Cough Syrups: దగ్గు సిరప్‌ తాగి 19 మంది చిన్నారులు మృతి.. ఆ రెండింటిని ఉపయోగించొద్దంటూ WHO హెచ్చరిక

|

Jan 12, 2023 | 8:09 AM

భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఉజ్బెకిస్తాన్‌కు బుధవారం (జనవరి 11) సిఫార్సు చేసింది..

Cough Syrups: దగ్గు సిరప్‌ తాగి 19 మంది చిన్నారులు మృతి.. ఆ రెండింటిని ఉపయోగించొద్దంటూ WHO హెచ్చరిక
Indian Cough Syrups
Follow us on

భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బుధవారం (జనవరి 11) సిఫార్సు ఉజ్బెకిస్తాన్‌కు చేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన Ambronol (ఆంబ్రోనాల్), DOK-1 Max (డాక్‌-1 మాక్స్) అనే ఈ రెండు రకాల దగ్గు సిరప్‌లను వినియోగించరాదని హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు సిరప్‌ల తయారీలో నాణ్యత ప్రమాణాలను ఉల్లంఘించినట్లు తెల్పింది. వీటిల్లో ప్రాణాంతకమైన ఇథిలీన్ గ్లైకాల్‌తోపాటు ఇతర విషపదార్ధాలు మోతాదుకు మించి ఉన్నట్లు పేర్కొంది.

కాగా మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన ఈ రెండు దగ్గు సిరప్‌లు తాగడం వల్లనే డిసెంబరు 22న ఉజ్బెకిస్థాన్‌లో 19 మంది చిన్నారులు మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో వెల్లడించింది. ఇటువంటి నాసిరకం ఉత్పత్తులను పిల్లలకు వినియోగించడంవల్ల మరణానికి దారితీయవచ్చని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉజ్బెకిస్థాన్‌లో 19 మంది చిన్నారుల మరణానికి కారణమైన మారియన్ బయోటెక్ కంపెనీ ప్రొడక్ట్స్‌కు లైసెన్స్‌ను ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ మంగళవారం సస్పెండ్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.