
పంజాబ్ లోని మోహలి జిల్లాకు చెందిన జస్నీత్ కౌర్ అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మంగళవారం అరెస్టవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లలలో కొంతమందిని బ్లాక్ మేయిలింగ్ చేస్తూ.. డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఆమెను మంగళవారం అరెస్టు చేశారు. ఓ 33 ఏళ్ల వ్యక్తి తనకు 2022 నవంబర్ లో గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చిందని.. వాళ్లు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఇటీవల చేసిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు. దీంతో లుదీనా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అయితే అసలు ఈ జస్నీత్ కౌర్ ఎవరో ఇప్పడు తెలుసుకుందాం. నిజానికి ఈమెకు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్ లో పలు అకౌంట్లు ఉన్నాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన బయోలో కూడా ఆమె ఆక్టర్, మోడల్ కూడా రాసి ఉంది. అయితే జస్నీత్ కౌర్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లలో డబ్బులు బాగా ఉన్న అబ్బాయిలను ఆకర్షించేదుకు కొంచె న్యూడ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేసేది.
ఆమెకు ఎవరైన దొరికాక వాళ్లతో ఇన్ స్టాలో చాట్ చేసేది. అలాగే వాటిని రికార్టు కూడా చేసేది. ఆ తర్వాత వాళ్లను డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసేది. కొన్నిసార్లు కొంతమంది గ్యాంగ్ స్టార్ల సహాయంతో కూడా ఆమె లక్ష్యం చేసుకున్న వాళ్లపై బెదిరింపు చర్యలకు పాల్పడేది. అయితే 2008 కూడా అచ్చం ఇలాంటి కేసులతోనే మోహలిలో ఆమె అరెస్టు అయ్యింది. ఆ తర్వాత విడుదలైంది. సోషల్ మీడియా వచ్చాక మళ్లీ ఇలాంటి చర్యలతు పాల్పడటం ప్రారంభించింది. 2022 సెప్టెంబర్ లో గుర్బిర్ అనే వ్యక్తిని పట్టుకొని అతడితో చాటింగ్స్ చేసేది. ఆ తర్వాత అతడ్ని రూ.2 కోట్లు ఇవ్వాలని లేదంటే తనతో చేసిన చాట్స్ లీక్ చేస్తానని బెదిరించింది. ఇప్పుడు తాజాగా ఏప్రిల్ 1న లుదియానా పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో జస్నీత్ కౌర్ ను అరెస్టు చేశారు. అలాగే ఆమె నుంచి ఒక బీఎమ్డబ్య్లూ కారు, ఓ మొబైల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..