
దేశ ప్రథమ పౌరుడు అని ఎవరిని పిలుస్తారు? 'రాష్ట్రపతి' అని ఠక్కున సమాధానం చెప్పేశారు కదూ. త్రివిధ దళాలకు భారత రాష్ట్రపతి నాయకత్వం వహిస్తారు. ప్రస్తుత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఈ విషయాలు మీ అందరీ తెలుసు..! మరి దేశ రెండో పౌరుడు (Second citizen of India) అని ఎవరిని పిలుస్తారు? అలాగే మూడో, నాలుడో, ఐదో పౌరుడు అని ఎవరెవరిని పిలుస్తారో తెలుసా..?

దేశ రెండో పౌరుడు అని ఉపరాష్ట్రపతిని పిలుస్తారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌కర్ పనిచేస్తున్నారు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగ్‌దీప్ ధన్‌కర్ ఏడాది (2022)లోనే ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టారు.

ఇక దేశ మూడో పౌరుడు అని ప్రధానమంత్రిని పిలుస్తారు. ఈ లెక్కన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తర్వాత దేశానికి మూడో పౌరుడు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని పదవిలో మోదీ 2014 నుంచి కొనసాగుతున్నారు.

దేశంలో వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా ఉన్న వారందరినీ దేశ నాలుగో పౌరులుగా గుర్తిస్తారు.

మాజీ రాష్ట్రపతిని దేశ ఐదో పౌరుడుగా పిలుస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కంటే ముండు ఆ పదవిలో రామ్ నాథ్ కోవింద్ పనిచేశారు. ఈ లెక్కన ప్రస్తుత ఐదో పౌరుడు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను పిలుస్తారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభ స్పీకర్‌లను దేశ ఆరో పౌరులుగా పిలుస్తారు. ప్రస్తుతం అత్యున్న న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు దేశ ఆరో పౌరులన్నమాట.