ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా మైత్రిబాగ్ జూలోని తెల్లపులి మూడు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిల్లలు పుట్టి ఇప్పటికి నెలన్నర అవుతోంది. కాగా, పులి రక్ష, పులి సుల్తాన్ జంటను 1997లో నందన్‌కానన్ జూలాజికల్ పార్క్ నుండి మైత్రిబాగ్‌కు తీసుకువచ్చారు. వాటికి చాలా పిల్లలు పుట్టాయి. వాటిలో 12 దేశంలోని వివిధ జంతుప్రదర్శనశాలలకు మార్చినట్టుగా జూ అధికారులు వెల్లడించారు. ఈ మూడు పులి పిల్లలు పుట్టడంతో ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని భిలాయ్‌లోని మైత్రీబాగ్ జూలో తెల్ల పులుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
రక్ష అనే తెల్లపులి ఏప్రిల్ 28న మూడు పిల్లలకు జన్మనిచ్చింది. తెల్లపులి సుల్తాన్ ఈ పిల్లలకు తండ్రి. నాలుగు నెలల పరిశీలన అనంతరం ఈ పిల్లలను ప్రజల సందర్శన కోసం విడుదల చేస్తామని జూ ఇన్‌చార్జి తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ పట్టణంలో మైత్రీ బాగ్ జంతుప్రదర్శనశాలలో తెల్లపులి రక్ష అనే మూడు చిన్న పిల్లలకు ముందుగా స్వాగతం పలికినట్లు అధికారులు తెలిపారు. తాజాగా జూ అధికారులు ఈ పిల్లల వీడియో ఫుటేజీని విడుదల చేశారు. రక్ష అనే పులి నెలన్నర క్రితం ఈ పిల్లలకు జన్మనిచ్చింది. ఇవి పెరిగి ఇప్పుడు నాలుగు కాళ్లపై నడుస్తూ జూ అధికారుల వద్ద బుసలు కొడుతూ కనిపిస్తున్నాయి.
#WATCH | Chhattisgarh | A white tigress, Raksha gave birth to three cubs around 1.5 months back at Maitri Bagh Zoo in Bhilai. The Zoo Authority released the first visuals of the cubs on 12th June.
(Video: Maitri Bagh Zoo) pic.twitter.com/KfOzLa457g
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 13, 2023
ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లోని మైత్రి బాగ్ జంతుప్రదర్శనశాలకు గతేడాది సుల్తాన్ అనే మరో పులి వచ్చింది. కోవిడ్-19 పరిస్థితి దృష్ట్యా రెండు సంవత్సరాల పాటు పులుల మధ్య సంతానోత్పత్తి నిరోధించారు జూ అధికారులు. కొన్ని నెలల క్రితం రెండు పులులు – రోమా, సుల్తాన్‌లను ఒకచోట చేర్చగా, అవి ఒక పులి పిల్లకు జన్మనిచ్చాయి. దీనికి జూ అధికారులు ‘సింగం’ అని పేరు పెట్టారు. ఇప్పుడు సింగం పూర్తిఆరోగ్యంగా ఉన్నట్టుగా జూ అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..