Ratan Tata Patriotism: ఆయన దేశ భక్తి ముందు డబ్బూ , వ్యాపారం ఎప్పుడూ చిన్నదే.. రతన్ టాటా గురించి చిన్న ఇన్స్పైరింగ్ స్టోరీ

|

Jul 22, 2021 | 2:55 PM

Ratan Tata Patriotism : ప్రముఖ భారతీయ వ్యాపార వేత్త.. రతన్ టాటా దేశ భక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. దేశం కష్టం లో ఉంది అంటే.. నేను ఉన్నాను అంటూ ఆర్ధికంగా..

Ratan Tata Patriotism: ఆయన దేశ భక్తి ముందు డబ్బూ , వ్యాపారం ఎప్పుడూ చిన్నదే.. రతన్ టాటా గురించి చిన్న ఇన్స్పైరింగ్ స్టోరీ
Ratan Tata
Follow us on

Inspiring Story of Ratan Tata: ప్రముఖ భారతీయ వ్యాపార వేత్త.. రతన్ టాటా దేశ భక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. దేశం కష్టం లో ఉంది అంటే.. నేను ఉన్నాను అంటూ ఆర్ధికంగా ఆదుకోవడానికి ముందుకొస్తారు అనే సంగతి అనేక సార్లు పలు విషయాల్లో రుజువైంది. కరోనా సమయంలో దేశం ఆర్ధిక కష్టాల్లో ఉన్న సమయంలో భారీ విరాళం అందించారు. అంతేకాదు.. ఆక్సిజన్ వంటి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే రతన్ టాటా దేశ భక్తి కి వ్యాపారం లాభాలు వంటి చూడడరని తెలిపే ఓ సంఘటనను మళ్ళీ గుర్తు చేసుకుందాం.. అభినవ భారతంలో నెత్తుటి మరక నేటి తరం మదిలో నుంచి చెరిగిపోని చేదు జ్ఞాపకం 26/11 ముంబై దాడులు. ఈ దాడుల తర్వాత భారత్ తో పాటు విదేశాల్లో ఉన్న తమ హోటల్స్ ను రీమోడలింగ్ చేయడం కోసం అతి పెద్ద టెండర్లను టాటా కంపెనీ ఆహ్వానించింది. కొన్ని పాకిస్తానీ కంపెనీలు కూడా టెండర్లు వేసాయి. ఆ కాంట్రాక్టు తాము దక్కించుకునేందుకు చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా, ఇద్దరు పాకిస్తానీ పారిశ్రామికవేత్తలు ఎలాంటి అపాయింట్ మెంటూ లేకుండా రతన్ టాటాను కలిసేందుకు బొంబాయిలో ఉన్న బొంబాయి హౌస్.. టాటా హెడ్ ఆఫీస్.. కు వచ్చారు.

టాటా హెడ్ ఆఫీసులో, పాకిస్తాన్ పారిశ్రామిక వేత్తలు.. రతన్ టాటాను కలవడం కోసం చాలా సేపు ఎదురుచూశారు. అలా వారు కొన్నిగంటల పాటు నిరీక్షించిన తరువాత సిబ్బంది వచ్చి, సార్ చాలా బిజీగా ఉన్నారు, అపాయింట్ మెంట్ లేనివారినెవరినీ కలవలేరు అని చెప్పి వెళ్ళిపోయారు. ఎలాగైనా టెండర్ ను దక్కించుకోవాలి అనుకున్న ఆ వ్యాపారవేత్తలు నిరాశ చెందిన వారిద్దరూ హస్తినకు వెళ్లారు. పాకిస్తాన్ హైకమీషన్ ద్వారా అప్పటి ఒక కేంద్ర మంత్రిని కలిసి విషయం చెప్పారు. తమకు రతన్ టాటా అపాయింట్మెంట్ కావాలని ఇప్పించమని అప్పటి కేంద్ర మంత్రిని కోరారు.

దీంతో ఆ కేంద్ర మంత్రి రతన్ టాటాకు ఫోన్ చేసి ఆ పాకిస్తానీలిద్దరినీ కలవాలని, వారి టెండర్లను పరిశీలించాలని ఒకింత గట్టిగా అడిగారు. వెంటనే రతన్ టాటా.. “మీరు సిగ్గు లేని వారు కావచ్చు, నేను కాదు” అని చెప్పి ఫోన్ పెట్టేసారు. అంతేకాదు అదే సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం టాటా సుమోలను దిగుమతి చేసుకోవడం కోసం ఆర్డరు ఇచ్చింది. అయితే రతన్ టాటా ఒక్క సుమోను కూడా పాకిస్తాన్ కు పంపడానికి అంగీకరించలేక, ఆ ఆర్డరును తిరస్కరించారు. అదీ రతన్ టాటా యొక్క దేశభక్తి. రతన్ టాటా దేశభక్తి ముందు డబ్బూ , వ్యాపారం కూడా చిన్నదే. ఇలాంటి దేశభక్తుడు గురించి ఎన్నిసార్లు విన్నా చదువుకున్నా మరింత మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది.

Also Read: Girl Dead Body: ఉత్తర ప్రదేశ్‌లో అమానుష ఘటన.. రోజంతా రైల్వే బ్రిడ్జికి వేలాడిన మైనర్ బాలిక డెడ్ బాడీ..!