Indian Railways: భారతదేశంలోని ఈ రైల్వేష్టేషన్‌ నుండి మీరు నిమిషాల్లో విదేశాలకు వెళ్లొచ్చు..

భారతీయ రైల్వేలు లగ్జరీ, సూపర్‌ఫాస్ట్ రైళ్ల సంఖ్యను నిరంతరం పెంచుతున్నాయి. అయితే మన దేశంలోని కొన్ని రైల్వే స్టేషన్లు, ఇతర దేశాల బోర్డర్లను భారత్‌కు కనెక్ట్ చేస్తున్నాయి. ఈ స్టేషన్ల నుంచి విదేశాలకు వెళ్లడం చాలా సింపుల్. అత్యంత ఈజీ కూడా. మన దేశంలోని ఒక రైల్వే స్టేషన్ నుండి మీరు నిమిషాల్లో విదేశాలకు వెళ్ళవచ్చు. అలాంటి రైల్వే ష్టేషన్‌ పేరు, ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Indian Railways: భారతదేశంలోని ఈ రైల్వేష్టేషన్‌ నుండి మీరు నిమిషాల్లో విదేశాలకు వెళ్లొచ్చు..

Updated on: Jul 10, 2025 | 8:33 PM

ప్రపంచంలోని పెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉన్న దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. సుదూర ప్రయాణాలకు రైలు అత్యంత చౌకైన, అందరికీ అందుబాటులో ఉండే రవాణా సాధనం. ఇండియన్ రైల్వేస్ మన దేశంలోని అన్ని ప్రాంతాలకు ట్రైన్ కనెక్టివిటీ కలిగి ఉంది. జంక్షన్లు, జోన్లుగా విభజించి రైల్వే సేవలను దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. భారతీయ రైల్వేలు లగ్జరీ, సూపర్‌ఫాస్ట్ రైళ్ల సంఖ్యను నిరంతరం పెంచుతున్నాయి. అయితే మన దేశంలోని కొన్ని రైల్వే స్టేషన్లు, ఇతర దేశాల బోర్డర్లను భారత్‌కు కనెక్ట్ చేస్తున్నాయి. ఈ స్టేషన్ల నుంచి విదేశాలకు వెళ్లడం చాలా సింపుల్. అత్యంత ఈజీ కూడా. మన దేశంలోని ఒక రైల్వే స్టేషన్ నుండి మీరు నిమిషాల్లో విదేశాలకు వెళ్ళవచ్చు. అలాంటి రైల్వే ష్టేషన్‌ పేరు, ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం…

మన దేశం నుండి విదేశాలకు కాలినడకన వెళ్లగలిగే అటువంటి రైల్వే స్టేషన్‌ ఒకటి ఉంది. ఈ స్టేషన్‌ను దేశంలోని చివరి స్టేషన్‌ అని కూడా పిలుస్తారు. ఇది జోగ్బాని రైల్వే స్టేషన్ (బీహార్ – నేపాల్) బీహార్‌లోని అరారియా జిల్లాలో ఉన్న జోగ్బాని రైల్వే స్టేషన్.. నేపాల్‌లోని బిరాత్‌నగర్‌కు కనెక్ట్ అవుతుంది. ఈ స్టేషన్ నుంచి ట్రావెలర్స్ ప్రయాణాలు చేయవచ్చు, సరుకు రవాణా కూడా జరుగుతుంది. జోగ్బాని రైల్వే స్టేషన్ ఇండో-నేపాల్ కనెక్టివిటీ, వాణిజ్య సంబంధాలకు కీలకంగా నిలుస్తోంది. ఈ భారతీయ స్టేషన్ నుండి నేపాల్ వెళ్ళడానికి వీసా లేదా పాస్‌పోర్ట్ అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..