Corona Vaccine: రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీం కోర్టు.. వ్యాక్సిన్‌ ధరల విషయంలో కేంద్రంపై కీలక వ్యాఖ్యలు

|

Apr 30, 2021 | 3:19 PM

Supreme Court: దేశ వ్యాప్తంగా శనివారం నుంచి మూడో దశ కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఒకే..

Corona Vaccine: రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీం కోర్టు.. వ్యాక్సిన్‌ ధరల విషయంలో కేంద్రంపై కీలక వ్యాఖ్యలు
Follow us on

Supreme Court: దేశ వ్యాప్తంగా శనివారం నుంచి మూడో దశ కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధరలు ఎందుకని ప్రశ్నించింది. ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లు అన్నింటిని కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదు..? కేంద్రానికి, రాష్ట్రాలకు రెండు ధరలు ఎందుకు..? ఇందులో వ్యత్యాసం ఏంటి అని శుక్రవారం కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

వ్యాక్సిన్‌ ధరల అంశం అనేది చాలా తీవ్రమైనది.. వ్యాక్సిన్‌లలో 50 శాతం ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, 45 ఏళ్లు పైబడిన వాళ్లకు ఇస్తామన్నారు. మిగతా 50 శాతం రాష్ట్రాలు వాడుకోవచ్చన్నారు. 59.46 కోట్ల మంది భారతీయులు 45 ఏళ్లలోపు ఉన్నవాళ్లే. అయితే వీళ్లలో చాలా మంది నిరుపేదలు, అణగారిన వర్గాలే ఉన్నారు. వాళ్లు వ్యాక్సిన్లకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకువస్తారు..? అని కేంద్రాన్ని నిలదీసింది. 18-44 ఏళ్ల వయసు ఉన్నవారికి ప్రభుత్వమే వ్యాక్సిన్‌ వేయడం చాలా ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. ఎన్ని వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయో మాకు తెలుసు. మీరు ఉత్పత్తిని పెంచేలా చూడాలి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీం

ఇక రాష్ట్రాలను కూడా అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా హెచ్చరించింది. సోషల్‌ మీడియాలో ఎవరైనా ఆస్పత్రి బెడ్స్‌ లేదా ఆక్సిజన్‌ కోసం అప్పీల్‌ చేసినప్పుడు వారిని వేధించినట్లు తెలిస్తే దానిని కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ సందేశం అన్ని రాష్ట్రాలు, డీజీపీలకు వెళ్లాల్సిందేనని తెలిపింది. ఏ సమాచారాన్ని రాష్ట్రాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని తెలిపింది.

ఇవీ కూడా చదవండి:

Telangana Night Curfew: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు.. ఎప్పటి వరకు అంటే..

SSC, Inter Eaxms: పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై హైకోర్టులో విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం

US Air Force Planes: అమెరికా నుంచి భారత్‌కు మరో రెండు కార్గో విమానాల్లో బయలుదేరిన ఆక్సిజన్‌ సిలిండర్లు, మాస్కులు, కిట్లు