Disha Ravi Toolkit : “టూల్ కిట్”. ఇప్పుడీ పదం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ పదం ఓ మహా ఉద్యమాన్ని పక్కదారి పట్టించింది. కొందరిని దేశద్రోహుల్ని చేసింది. ఇంత ప్రభావితం చేస్తున్న ఈ పదం వెనుక కదం తొక్కించే ప్రణాళిక ఉంటుంది. సరిగ్గా యూజ్ చేస్తే, ప్రభుత్వాలను గడగడలాడిస్తుంది. అదే కాస్త వంకరగా ఉపయోగిస్తే..అంతే సరదా తీర్చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రకరకాల ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలు అయినా, వేరే ఉద్యమాలు అయినా వీటన్నింటికీ సంబంధించి కొన్ని యాక్షన్ పాయింట్స్ రూపొందిస్తారు. అంటే, ఉద్యమం ముందుకు తీసుకెళ్లడానికి చేయాల్సిన కొన్నింటిని ప్లాన్ చేసుకుంటారు. ఒక డాక్యుమెంట్‌లో ఆ యాక్షన్ పాయింట్స్ నమోదు చేసుకుంటారు. దానినే ‘టూల్‌కిట్’ అంటారు.
ఈ డాక్యుమెంట్ కోసం సోషల్ మీడియాలో ‘టూల్‌కిట్’ అనే మాటను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ, అందులో సోషల్ మీడియా వ్యూహంతోపాటూ, శారీరకంగా సామూహిక ప్రదర్శనలు చేయడానికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తుంటారు. ఉద్యమం ప్రభావాన్ని పెంచడానికి ఎవరు సాయపడతారని అనుకుంటారో, వారి మధ్య ఈ టూల్‌కిట్‌ను తరచూ షేర్ చేస్తుంటారు. అలాంటప్పుడు టూల్‌కిట్ అనేది ఒక ఉద్యమ వ్యూహానికి కీలకం అని చెప్పడం తప్పు కాదు.
మనం గోడలకు అతికించే పోస్టర్ల ఆధునిక రూపంగా టూల్‌కిట్‌ను పిలవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచీ ఉద్యమాలు చేసినవారు, దాని గురించి చెప్పడానికి, ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునివ్వడానికి వాటిని ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో మార్కెటింగ్ నిపుణుల ప్రకారం ఈ డాక్యుమెంట్ ప్రధాన ఉద్దేశం ప్రజలను సమన్వయం చేయడం. టూల్‌కిట్‌లో సాధారణంగా జనాలు ఏం రాయచ్చు, ఎలాంటి హాష్‌ట్యాగ్ ఉపయోగించవచ్చు, ఏ సమయంలో ట్వీట్ లేదా పోస్ట్ చేస్తే ప్రయోజనం ఉంటుంది.
ఇలా దిశారవి కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పుడీ టూల్‌కిట్ షేరింగే ముగ్గురు యువతులను జైలు పాలు చేసింది. అసలు ఎవరీ దిశారవి.. కిసాన్ పరేడ్ హింసకు..ఆమెకు సంబంధం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రైతుల నిరసనలకు ముందు నుంచీ మద్దతు తెలుపుతోన్న దిశారవి, గ్రెటా థెన్‌బర్గ్ షేర్ చేసిన టూల్ కిట్ ను రూపొందించినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు.
Read also : Disha Ravi : పానకంలో పుడకలా పాకిస్తాన్ ఎంట్రీ, తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని ఇమ్రాన్ పార్టీ