PM CARES for Children: కరోనా సంక్షోభంలో అనాథలైన పిల్లల కోసం ప్రభుత్వం ముందడుగు.. PM చిల్డ్రన్ స్క్రీమ్ ప్రయోజనాలు తెలుసా ?

|

Jul 29, 2022 | 9:56 PM

PM CARES for Children Scheme: కరోనా సెకెండ్ వేవ్ తరువాత కోవిడ్ బాధిత కుటుంబాల్లోని చిన్నారులకు ఆదుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ఆర్ధిక సహాయం ప్రకటించింది. విద్య, ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది.

PM CARES for Children: కరోనా సంక్షోభంలో అనాథలైన పిల్లల కోసం ప్రభుత్వం ముందడుగు.. PM చిల్డ్రన్ స్క్రీమ్ ప్రయోజనాలు తెలుసా ?
Pm Cares For Children Schem
Follow us on

మార్చి 2020లో దేశంలో ప్రపంచంలో కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో కూడా కరోనా కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు. కరోనా సెకెండ్ వేవ్‌లో పెద్ద సంఖ్యలో పిల్లలు అనాథలుగా మారారు. అటువంటి పరిస్థితిలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌ను ప్రారంభించింది. 30 మే 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ కార్యక్రమంలో పిల్లల కోసం పీఎం కేర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించడంతో పీఎం నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పాస్‌బుక్, ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య పథకం వర్చువల్ హెల్త్ కార్డ్‌ను కూడా ఈరోజు ప్రారంభించారు. 

విశేషమేమిటంటే, కరోనా సెకెండ్ వేవ్ తరువాత కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం ప్రకటించింది. వారి విద్య , ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. కాబట్టి ఈ పథకం ద్వారా అందించబడిన సౌకర్యాల గురించి తెలుసుకుందాం..

పీఎం కేర్ స్కీమ్ కింద పిల్లలు ఈ ప్రయోజనాన్ని పొందుతారు-

  1. కరోనా మహమ్మారి సమయంలో అనాథలైన పిల్లలకు 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4,000 స్టైఫండ్‌గా అందజేస్తారు.
  2. చిన్నారికి 23 ఏళ్లు నిండిన తర్వాత ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుంది.
  3. పిల్లలకు ఉచిత విద్య అందుతుంది.
  4. 11 నుండి 15 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలను నవోదయ విద్యాలయంలో లేదా ఏదైనా రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్చుకుంటారు.
  5. పిల్లల ఉన్నత చదువుల కోసం రుణ సహాయం అందించబడుతుంది. పీఎం కేర్ ఫండ్ నుంచి రుణంపై వడ్డీ ఇవ్వబడుతుంది.
  6. ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కింద అలాంటి పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు రూ.5 లక్షల ఆరోగ్య కార్డును అందజేస్తారు.
  7. మరోవైపు, పిల్లల అడ్మిషన్ ప్రైవేట్ పాఠశాలలో జరిగితే, అతని ఫీజును పీఎం కేర్స్ ఫండ్ ఇస్తుంది.
  8. పిల్లల ఫీజులు కాకుండా స్కూల్ యూనిఫాం ఖర్చులను పీఎం కేర్ ఫండ్ అందజేస్తుంది.

కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సహాయం చేయడానికి ఈ పథకం ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా, అటువంటి పిల్లల పెంపకం నుండి ఇతర ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.