PM Modi: విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోడీ.. ఘనంగా అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం..

PM Modi: విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోడీ.. ఘనంగా అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం..

Shaik Madar Saheb

|

Updated on: Jul 29, 2022 | 9:52 PM

PM Modi meet students: చెన్నైలోని అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం హాజరయ్యారు. కాన్వొకేషన్‌ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. భారతదేశం శాస్త్రవేత్తలు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, నిపుణులు, సామాన్య ప్రజల సహాయంతో తెలియని సమస్యలను సైతం ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొందని పేర్కొన్నారు.



PM Modi meet students: చెన్నైలోని అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం హాజరయ్యారు. కాన్వొకేషన్‌ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. భారతదేశం శాస్త్రవేత్తలు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, నిపుణులు, సామాన్య ప్రజల సహాయంతో తెలియని సమస్యలను సైతం ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొందని పేర్కొన్నారు. ఫలితంగా దేశంలోని ప్రతి రంగం సరికొత్త అభివృద్ధితో దూసుకెళ్తోందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగుతుందన్నారు. అది పరిశ్రమ రంగమైనా, ఆవిష్కరణ రంగం, పెట్టుబడి లేదా అంతర్జాతీయ వాణిజ్యం ఇలా అన్ని రంగాల్లో భారత్‌ అడ్డంకులను అధిగమిస్తూ ముందుకువెళ్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ.. గ్రాడ్యుయేట్ విద్యార్థులను కలిసేందుకు ప్రధాని మోడీ వేదిక నుంచి కిందకు దిగి వారి దగ్గరకు వెళ్లారు. ఈ సందర్భంగా పలు తరగతి గదులను సైతం సందర్శించారు. స్థలాభావం కారణంగా చాలామంది విద్యార్థులు కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదని అధికారులు తెలిపారు.

 

Published on: Jul 29, 2022 09:51 PM