kajal sinha dies: బెంగాల్‌లో మరో నేతను మింగేసిన కరోనా రాకాసి.. చికిత్స పొందుతూ టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి కాజల్ సిన్హా మృతి

|

Apr 25, 2021 | 1:36 PM

పశ్చిమ బెంగాల్‌లో కరోనా పంజా విసురుతోంది. వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. సాధారణ జనంతో పాటు ప్రముఖులు సైతం ప్రాణాలు వీడుస్తున్నారు.

kajal sinha dies: బెంగాల్‌లో మరో నేతను మింగేసిన కరోనా రాకాసి.. చికిత్స పొందుతూ టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి కాజల్ సిన్హా మృతి
Tmc Candidate Kajal Sinha Dies With Corona
Follow us on

kajal sinha dies with Corona: పశ్చిమ బెంగాల్‌లో కరోనా పంజా విసురుతోంది. వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. సాధారణ జనంతో పాటు ప్రముఖులు సైతం ప్రాణాలు వీడుస్తున్నారు. ఇప్పటికే బెంగాల్‌ ఎన్నికల బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు కరోనా బారినపడ్డారు. ఇందులో ఇప్పటికే కొందరు కన్నుమూయగా.. తాజాగా ఖర్దాహ నియోజకవర్గ తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కాజల్‌ సిన్హా మరణించారు. ఇటీవల కరోనా బారినపడ్డ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 21న కోల్‌కతాలోని బెలెఘాటా ఐడీ హాస్పిటల్‌లో చేర్పించారు.

ఈ నెల 23న కాజల్ సిన్హా పరిస్థితి మరింత విషమించింది. మూడు రోజులుగా వెంటిలేషన్‌పై ఉంచగా.. ఆదివారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అంతకు ముదు ముర్షిదాబాద్‌లోని షంషేర్‌గంజ్‌, జంగిపూర్‌ నియోజకవర్గాల అభ్యర్థులు మృతి చెందగా.. అయా నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఖర్దాడా నియోజకవర్గంలో ఆరు విడుతలో భాగంగా ఈ నెల 22న ఎన్నికలు జరిగాయి. కాజల్‌ సిన్హా మృతిపై బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో షాక్‌కు గురయ్యానని, ప్రజాసేవ కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు.

Read Also…  Oxygen Plants: దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు.. వీలైనంత త్వరగా ఏర్పాటు కావాలి: ప్రధాని మోదీ