పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె.. త్వరలో లింగమార్పిడి ఆపరేషన్‌

|

Jun 23, 2023 | 7:11 AM

శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకోనుంది. ఆపరేషన్‌ తర్వాత తన పేరును 'సుచేతన్'గా మారాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెల్పింది..

పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె.. త్వరలో లింగమార్పిడి ఆపరేషన్‌
Former Chief Minister Buddhadeb Bhattacharya's Daughter
Follow us on

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకోనుంది. ఆపరేషన్‌ తర్వాత తన పేరును ‘సుచేతన్’గా మారాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెల్పింది. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నానని, అవసరమైన ధృవపత్రాలతో వైద్యులను సంప్రదిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా ఎల్‌జీబీటీక్యూ వర్క్‌షాప్‌కు సుచేతన హాజరయ్యింది. ఈ కార్యక్రమంలో సుచేతన మాట్లాడుతూ..

‘నా తల్లిదండ్రుల లేదా కుటుంబ గుర్తింపు పెద్ద విషయం కాదు. నా ఎల్‌జీబీటీక్యూ ఉద్యమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక ట్రాన్స్‌మ్యాన్‌గా సమాజంలో ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను ఆపాలనుకుంటున్నాను. నా వయసు ప్రస్తుతం 41. నా జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు నేను తీసుకోగలను. దయచేసి నా తల్లిదండ్రులను ఇందులోకి లాగవద్దు. మానసికంగా తనను తాను మనిషిగా భావించే వ్యక్తి మనిషే. నేను మానసికంగా మగవాడిని. నన్ను నేను భౌతికంగా కూడా మార్చుకోవాలని కోరుకుంటున్నానని’ సుచరిత మీడియాకు తెలింది. ఇంకా ఈ విధంగా మాట్లాడింది..

‘నా నిర్ణయాన్ని నా తల్లిదండ్రులు గౌరవిస్తారని అనుకుంటున్నాను. నాకు పోరాడే ధైర్యం ఉంది. ఎవరు ఏం చెప్పినా పట్టించుకోను. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ వార్తలను వక్రీకరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని మీడియా సుముఖంగా వెల్లడించారు. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ ధైర్యంగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.