
Ashim Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు ఆషీమ్ బెనర్జీ కరోనా మహమ్మారి బారినపడి కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆషీమ్ బెనర్జీ కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు.
ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన మెడికా హాస్పిటల్లో చేరారు. దీంతో ఆయనకు వైద్యులు పూర్తిస్థాయి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఇవాల పరిస్థితి విషమించి మృతి చెందారని ఆసుపత్రి చైర్మన్ అలోక్రాయ్ పేర్కొన్నారు. కరోనా నిబంధనల మధ్య మధ్యాహ్నం అంత్యక్రియలు నిమ్తలా మహా శ్మశాన్ ఘాట్లో జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆషీమ్ బెనర్జీ మృతితో సీఎం మమతా బెనర్జీ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆషీమ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Read Also… Medical Negligence: సమయానికి వైద్యం అందక నిండు గర్బిణి మృతి.. 5 ఆసుపత్రులు తిరిగిన దక్కని ప్రాణం..!