Delhi Weather Alert: దేశ రాజధాని ఢిల్లీ(Delhi )లో రోజు రోజుకీ చలి తీవ్రత పెరిగిపోతోంది. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొంగమంచు కురుస్తుండడం.. తీవ్రమైన శీతల గాలుల(Cold Waves)తో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. రోడ్లపై పొంగమంచు కమ్ముకోవడంతో ఉదయం 9 గంటలు దాటినా వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఢిల్లీలో 7.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (IMD ) పేర్కొన్నది. అంతేకాదు మంగళవారం కూడా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. అంతేకాదు.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తోపాటు పలు వాయవ్య రాష్ట్రాల్లో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read: