Dy CM Renu Devi Residence: కుండపోత వర్షానికి నీట మునిగిన డిప్యూటీ సీఎం ఇల్లు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో!

బీహార్‌ రాజధాని పాట్నాలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రేణుదేవి నివాసం నీటమునిగింది.

Dy CM Renu Devi Residence: కుండపోత వర్షానికి నీట మునిగిన డిప్యూటీ సీఎం ఇల్లు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో!
Water Accumulates Bihar Deputy Cm Renu Devi Residence In Patna Due Heavy Rain

Updated on: Jun 26, 2021 | 2:27 PM

Water Accumulates Dy CM Renu Devi Residence: భారీ వర్షాలకు ఎవరైనా సమానమే అన్నట్లు బీహార్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు రుజువు చేశాయి. బీహార్‌ రాజధాని పాట్నాలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రేణుదేవి నివాసం నీటమునిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాట్నాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. దీంతో భారీ వరద దాటికి డిప్యూటీ సీఎం నివాసం ఎదుట ఒకటిన్నర అడుగుమేర నీరు నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి కొద్ది గంటల్లోనే కురిసిన జడివానకు 145 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పెద్ద ఎత్తున రోడ్లు నీట ముగగా.. కాలువలు పొంగి పొర్లాయి.

ప్రస్తుత సీజన్‌లో వర్షాలు భారీగా పడడం సాధారణమేనని వాతావరణ కేంద్ర శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం భారీగా ఉందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో బీహార్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించింది. దీంతో ఆ రాష్ట్రంలో వాతావరణ శాఖ శనివారం ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.


Read Also….Maoist Sharadakka: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ భార్య శారదక్క కరోనా మృతి.. ఆయన చనిపోయిన 4రోజులకే మరో విషాదం!