Video: ‘ఖడ్గమృగాన్ని ఢీ కొన్న ట్రక్‌’ వీడియోను షేర్‌ చేసిన అస్సాం సీఎం.. ఫైర్‌ అవుతోన్న నెటిజన్లు కారణం తెలిస్తే మీరూ..

|

Oct 09, 2022 | 9:17 PM

సీఎం హిమంత బిస్వా శర్మ షేర్ చేసిన పది సెకన్ల నిడివి గల ఈ క్లిప్‌లో.. ఖడ్గమృగం అడవిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డుపై వెళ్తున్న ట్రక్‌ను ఢీ కొట్టడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఖడ్గమృగం రోడ్డు మీద..

Video: ఖడ్గమృగాన్ని ఢీ కొన్న ట్రక్‌ వీడియోను షేర్‌ చేసిన అస్సాం సీఎం.. ఫైర్‌ అవుతోన్న నెటిజన్లు కారణం తెలిస్తే మీరూ..
Rhino Hit By Truck
Follow us on

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తాజాగా ఓ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు. అందులో ధుబ్రి జిల్లాలోని హల్దిబారి వద్ద ఒక ఖడ్గమృగం వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడం కనిపిస్తుంది. హల్దిబారీలో జరిగిన దురదృష్టకర సంఘటనగా  సీఎం పేర్కొన్నారు. ఖడ్గమృగం ప్రాణాలతో బయటపడిందని, ఈ జంతువును ఢీ కొట్టిన వాహనానికి జరిమానా విధించినట్లు సీఎం తన ట్వీట్‌లో తెలిపారు. కాగా కజిరంగా వద్ద వన్య ప్రాణులను సంరక్షించాలనే సంకల్పంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకంగా 32 కిమీ ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మించడంపై పని చేస్తున్న విషయం తెలిసిందే.

సీఎం హిమంత బిస్వా శర్మ షేర్ చేసిన పది సెకన్ల నిడివి గల ఈ క్లిప్‌లో.. ఖడ్గమృగం అడవిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డుపై వెళ్తున్న ట్రక్‌ను ఢీ కొట్టడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఖడ్గమృగం రోడ్డు మీద జారిపడి పడుతూ.. లేస్తూ.. అడవిలోకి వెళ్లడం వీడియోలో చూడొచ్చు. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌ తప్పేమీ లేదు. కుంటి సాకులతో జరిమానాలు విధించడం మాని.. ముందు అండర్‌పాస్‌లను నిర్మించండని ఒకరు, 32 కిమీ కారిడార్ నిర్మాణ సమయంలో మీరు జంతువులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. చెట్ల నరికివేతకు దారితీయవచ్చు. బదులుగా.. నుమాలిగర్ వద్ద బి’పుత్ర వంతెన పూర్తయితే, అన్ని వాహనాలు నార్త్ బ్యాంక్ మీదుగా వెళ్లేలా చేయవచ్చు. ముందు ఆ పనులను వేగంగా పూర్తి చేయండి అని మరొకరు వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు సూచిస్తూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అస్సాం ప్రభుత్వం కాజిరంగా నేషనల్ పార్క్ ఆక్రమణ, ఖడ్గమృగాల వేట నుంచి విముక్తి కలిగించడం, బోడోలాండ్ ప్రాంతంలో ఆవుల అక్రమ రవాణాను నిలిపివేయడం వంచి చర్యలు చేపట్టిన అస్సాం ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ప్రశంసలు కురిపించారు.