స్నాతకోత్సవంలో విద్యార్ధిని విచిత్ర ప్రవర్తన.. గవర్నర్‌ నుంచి డిగ్రీ తీసుకోవడానికి నిరాకరన! వీడియో

మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 32 స్నాతకోత్సవం బుధవారం (ఆగస్ట్‌ 13) జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. విద్యార్ధులందరికీ గవర్నర్‌ రవి చేతుల మీదగా డిగ్రీ పట్టాలు అందిస్తున్నారు. అయితే ఆయన వద్ద డిగ్రీ పట్టాని స్వీకరించడానికి ఓ పీహెచ్‌డీ స్కాలర్ నిరాకరించడం..

స్నాతకోత్సవంలో విద్యార్ధిని విచిత్ర ప్రవర్తన.. గవర్నర్‌ నుంచి డిగ్రీ తీసుకోవడానికి నిరాకరన! వీడియో
Phd Scholar Snubs Governor At Convocation

Updated on: Aug 14, 2025 | 9:48 AM

చెన్నై, ఆగస్ట్‌ 14: తమిళనాడులోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 32 స్నాతకోత్సవం బుధవారం (ఆగస్ట్‌ 13) జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. విద్యార్ధులందరికీ గవర్నర్‌ రవి చేతుల మీదగా డిగ్రీ పట్టాలు అందిస్తున్నారు. అయితే ఆయన వద్ద డిగ్రీ పట్టాని స్వీకరించడానికి ఓ పీహెచ్‌డీ స్కాలర్ నిరాకరించడం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది. వేదికపై ఆయనను తప్పించి.. యూవర్సిటీ వీసీ చంద్రశేఖర్ చేతుల మీదగా డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సదరు విద్యార్థిని గవర్నర్‌ పట్ల వ్యవహరించిన తీరుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మనోన్మణియం సుందరనార్ యూనివర్సిటీలో మైక్రో ఫైనాన్స్‌లో డాక్టరేట్ పొందిన జీన్ జోసెఫ్ అనే స్కాలర్ తాను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్‌ వద్ద డిగ్రీ పట్టా అందుకోవడానికి నిరాకరించినట్లు తెలిపింది. గవర్నర్ ఆర్.ఎన్.రవి, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకం. ఆయన తమిళ ప్రజలకు ఏమీ చేయలేదని, అందుకే తాను ఆయన నుంచి డిగ్రీని స్వీకరించాలనుకోలేదని ఆమె అన్నారు. కాగా గవర్నర్‌ నుంచి డిగ్రీ పట్టా అందుకోవడానికి నిరాకరించిన సదరు విద్యార్ధిని జీన్ జోసెఫ్‌ ఎవరో కాదు.. డీఎంకే (DMK) పార్టీకి చెందిన నాగర్‌కోయిల్ డిప్యూటీ సెక్రటరీ ఎం రాజన్ భార్య. తమిళరాడు రాష్ట్ర గవర్నర్‌కు అధికార డీఎంకే ప్రభుత్వానికి మధ్య ఉన్న భేదాభిప్రాయాల నేపథ్యంలో ఆమె ఉద్దేశపూర్వకంగానే స్టేజీపై ఈ విధంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో గవర్నర్ రవి తొలుత విద్యార్ధిని పొరపాటుగా వెళ్లినట్లు భావించి, ఆమెను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ విద్యార్థిని గవర్నర్‌ మాత్రం గవర్నర్‌ మాటను లెక్కచేయకుండా, కావాలనే ఉద్దేశపూర్వకంగా తన ఎంపిక ఉన్నట్లు వీడియో చూస్తే అవగతమవుతుంది. దీంతో గవర్నర్ కూడా అంగీకారంగా తల ఊపుతూ వీడియోలో కనిపించారు. దీనిపై వర్సిటీ సీనియర్‌ ప్రొఫెసర్‌ కూడా మాట్లాడుతూ.. ఆమె ఉద్దేశపూర్వకంగానే అలా చేసిందని మేము తర్వాత గ్రహించామని అన్నారు.

తమిళనాడు ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి మధ్య గత కొంతకాలంగా అభిప్రాయ భేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే ఉంచుకోవడంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తుంది. దీనిపై 2023లో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ విధమైన ప్రవర్తన రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీం తీర్పు వెలువరించింది. తీర్పు తర్వాత కూడా గవర్నర్ రవి చర్యల్లో మార్పురాలేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి పేరు మీద కలైంగర్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించే బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపగా.. నెల గడువును కూడా ఉల్లంఘించారు. గతంలో తమిళనాడు ఉన్నత విద్యా మంత్రులు గవర్నర్ రవి అధ్యక్షతన జరిగే స్నాతకోత్సవాలను బహిష్కరించారు. అయితే స్నాతకోత్సవ వేదికపై గవర్నర్‌ను బహిరంగంగా తిరస్కరించడం ఇదే తొలిసారి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.