Viral Video: లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఊహించని సీన్.. భయంతో పరుగులు తీసిన జనాలు! వీడియో వైరల్

|

May 28, 2024 | 5:10 PM

లక్నోలోని గోమతీనగర్‌లోని వికల్ప్ ఖండ్-4లో ఉన్న వీవీఐపీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఉదయం కలకలం రేగింది. కాంప్లెక్స్‌ రెండో అంతస్తులోని ఫ్లాట్‌లోకి మొసలి ఆకారంలో ఉన్న ఓ వింత జీవి ప్రవేశించింది. చూసేందుకు అచ్చం మొసలి మాదిరి భారీ పరిమాణంలో ఉంది. అది ఓ మహిళ గదిలోకి ప్రవేశించడంతో ఆమె కెవ్వు.. కెవ్వు.. మంటూ గావు కేకలు..

Viral Video: లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఊహించని సీన్.. భయంతో పరుగులు తీసిన జనాలు! వీడియో వైరల్
Apartment Complex
Follow us on

లక్నో, మే 28: లక్నోలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులోకి మొసలి రావడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే కొంతసేపటి తర్వాత అది మొసలి కాదని, ఇది ఇంకేందో జీవని తెలిసి.. అపార్ట్‌మెంట్‌ వాసులంతా హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలింతకీ ఏం జరిగిందంటే..

లక్నోలోని గోమతీనగర్‌లోని వికల్ప్ ఖండ్-4లో ఉన్న వీవీఐపీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఉదయం కలకలం రేగింది. కాంప్లెక్స్‌ రెండో అంతస్తులోని ఫ్లాట్‌లోకి మొసలి ఆకారంలో ఉన్న ఓ వింత జీవి ప్రవేశించింది. చూసేందుకు అచ్చం మొసలి మాదిరి భారీ పరిమాణంలో ఉంది. అది ఓ మహిళ గదిలోకి ప్రవేశించడంతో ఆమె కెవ్వు.. కెవ్వు.. మంటూ గావు కేకలు వేసింది. దీంతో అపార్ట్‌మెంట్‌లోని వారంతా అటుగా పరుగులు తీశారు. స్థానికులు వెంటనే అటవీశాఖకు సమాచారం అందించి 112కు కాల్ చేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీశాఖ బృందం గంటపాటు శ్రమించి వింత జీవిని సురక్షితంగా పట్టుకుని గోనె సంచిలో వేసుకుని తమతోపాటు తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

అందిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో గోమతి నగర్‌లోని కథౌటా సరస్సు సమీపంలో ఉన్న ‘యష్ అపార్ట్‌మెంట్’ రెండవ అంతస్తు ఫ్లాట్‌లోని మెట్ల పైభాగంలో వింత జీవి నిద్రిస్తూ కనిపించింది. దీనిని చూసిన అపార్ట్‌మెంట్‌ వాసులు భయంతో కిందకు పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించి అటవీ శాఖ అధికారి అంకిత్ శుక్లా మాట్లాడుతూ.. అది మొసలి కాదని, ఉడుము అనే బల్లి జాతీ ప్రాణి అని అటవీ అధికారులు తెలిపారు. ఇవి సాధారణంగా యాక్టివ్‌గా ఉండవు. వీటి వల్ల మనుషులకు ఎలాంటి హాని ఉండదని అన్నారు. ఉడుములు మనుషులను చూసి భయపడి పారిపోతాయి. ఇది విషపూరితమైనది కాదు. దీనికి భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.