Watch Video: పొలాల్లో కూలీలు పనులు చేసుకుంటూ ఉండగా అటుగా వచ్చిన వింత ఆకారం.. ఏంటా అని చూడగా..!

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో మంగళవారం (మే 7) షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. పంట పొలాల్లో కూలీలు పనులు చేసుకుంటుండగా భారీ కొండ చిలువ రావడంతో కలకలం చోటు చేసుకుంది. వెంటనే బయటకు పరుగులు తీశారు. దాని పొడవు లావును బట్టి దాదాపు 13 అడుగుల పొడవు, ఒకటిన్నర క్వింటాల్‌ వరకు బరువుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవి నెలలో నీటి వనరుల అన్వేషణలో సాధారణంగా..

Watch Video: పొలాల్లో కూలీలు పనులు చేసుకుంటూ ఉండగా అటుగా వచ్చిన వింత ఆకారం.. ఏంటా అని చూడగా..!
Massive Pytho

Updated on: May 08, 2024 | 3:42 PM

హరిద్వార్‌, మే 8: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో మంగళవారం (మే 7) షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. పంట పొలాల్లో కూలీలు పనులు చేసుకుంటుండగా భారీ కొండ చిలువ రావడంతో కలకలం చోటు చేసుకుంది. వెంటనే బయటకు పరుగులు తీశారు. దాని పొడవు లావును బట్టి దాదాపు 13 అడుగుల పొడవు, ఒకటిన్నర క్వింటాల్‌ వరకు బరువుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవి నెలలో నీటి వనరుల అన్వేషణలో సాధారణంగా వన్యప్రాణులు ఇలా తరచూ జనావాసంలోకి వస్తుంటాయి. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భారీ కొండ చిలువ నీరు, ఆహారం కోసం అడవి నుంచి పంటపొలాల్లోకి రావడంతో గ్రామస్తులు షాకయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న లక్సర్ల అటవీ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కొండ చిలువను రక్షించే పనిలో పడింది. రెండు గంటలపాటు తీవ్రంగా శ్రమించి ఆ కొండ చిలువను పట్టుకున్నారు. పొదల్లో నక్కిన కొండ చిలువను బయటకు లాగి, దానిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. ఈ మేరకు ఫారెస్ట్ రేంజ్ అధికారి శైలేంద్ర సింగ్ నేగి మీడియాకు తెలిపారు. ఈ కొండ చిలువ సుమారు 13 అడుగుల పొడవు, సుమారు 125 కిలోల బరువు ఉంది. అందువల్ల అటవీ సిబ్బంది దానిని రక్షించడానికి సమయం పట్టింది. అయితే గ్రామస్తుల సహాయంతో అటవీ సిబ్బంది ఈ పెద్ద కొండచిలువను విజయవంతంగా రక్షించి అటవీ ప్రాంతం రిజర్వ్‌లో వదిలిపెట్టారని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.