Mumbai Airport Fire Accident: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తృటిలో పెను ముప్పు తప్పింది. ఓ ఎయిరిండియా విమానాన్ని రన్‌వే మీదకు లాక్కెళ్తున్న టోయింగ్ వెహికల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 85 మంది ప్రయాణీకులు, విమాన సిబ్బంది ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఫైర్ సిబ్బందిని రంగంలోకి దించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో.. భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. దీంతో ఎయిరిండియా విమాన సిబ్బంది, విమానాశ్రయ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఏ మాత్రం ఆలస్యమై.. టోయింగ్ వెహికల్‌కు అంటుకున్న మంటలు కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్న ఎయిరిండియా విమానానికి వ్యాపించి ఉంటే భారీ నష్టం సంభవించేది. ఈ ప్రమాదంలో టోయింగ్ వెహికల్ పూర్తిగా కాలి బూడిదయ్యింది. టోయింగ్ వాహనంలో ఎందుకు మంటలు చెలరేగాయన్న అంశంపై విమానాశ్రయ అధికారులు ఆరాతీస్తున్నారు. ఈ ప్రమాద ఘటన ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కొద్ది సేపు కలకలం సృష్టించింది.
ఈ ఘటనలో పెద్దగా ఆస్తినష్టమేమీ సంభవించలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
मुंबई एयरपोर्ट पर टला बड़ा हादसा
एयर इंडिया की फ्लाइट को tow करने वाले वाहन में फ्लाइट के पास ही अचानक लगी आग
मौके पर एयरपोर्ट की फायर टीम ने समय रहते आग पर पाया काबू
दोपहर 1 बजे की घटना..@indiatvnews @IndiaTVHindi pic.twitter.com/jjzGVSaLaJ
— Atul singh (@atuljmd123) January 10, 2022
Also Read..
Covid-19: రోజూవారి కేసుల సంఖ్య 8 లక్షలకు చేరొచ్చు.. అప్రమత్తత అత్యవసరం.. వైద్య నిపుణుల హెచ్చరిక