కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆదివారం (మే 28న) జరుగుతుంది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వైదిక సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటలకు పార్లమెంట్ హాల్లో రాజదండం ఆవిష్కరణ ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు ప్రధాని మోదీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించి.. ప్రసంగిస్తారు. అటు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. 18 ఎన్డీఏ కూటమి పార్టీలతో పాటు మరో 7 రాజకీయ పార్టీలు ప్రారంభోత్సనికి హాజరవుతామని ప్రకటించాయి. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా కాకుండా.. ప్రధాని మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించం పట్ల అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. 20 విపక్షాలు కార్యక్రమాన్ని బహిష్కరిస్తునట్టు ప్రకటించాయి. విపక్షాల నిర్ణయాన్ని బీజేపీ సహా ఎన్టీయే పక్షాలు తప్పుబట్టాయి. తాజాగా జేడీఎస్,బీఎస్పీ పార్టీలు కూడా కార్యక్రమానికి హాజరవుతామని ప్రకటించాయి. వైసీపీ, టీడీపీ, బీజేడీ, అకాలీదళ్ తదితర పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాయి.
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవ వేడుకను బహిష్కరిస్తున్న విపక్షాల తీరుపై కేంద్రమంత్రి అమిత్‌షా మరోసారి విరుచుకుపడ్డారు. చత్తీస్‌ఘడ్ అసెంబ్లీకి సోనియా శంకుస్థాపన చేశారని , తమిళనాడు అసెంబ్లీని మన్మోహన్, సోనియా ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. పార్లమెంట్ ప్రారంభోత్సవంపై విపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వ్యవహారంపై జోర్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టుకు నిరాకరించింది. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ఆపాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలయ్యింది. ప్రధాని కాకుండా రాష్ట్రపతి చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం జరగాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌లో న్యాయశాఖ , లోక్‌సభ సెక్రేటరియట్ , హోంశాఖను కూడా ప్రతివాదులుగా చేర్చారు. అయితే దీనిపై విచారణ జరపలేంటూ సుప్రీంకోర్టు పిల్‌ను తిరస్కరించింది.
కాగా కొత్త పార్లమెంటు భవనం వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ సహా పలవురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది.