Viral Video: సాయం చేసినందుకు చెంపదెబ్బలు.. ఆగ్రహించిన సెక్యూరిటీగార్డులు.. అసలేం జరిగిందంటే..

|

Aug 30, 2022 | 8:51 AM

తమకంటే చిన్నస్థాయి వారి పట్ల చిన్న చూపు చూడటం సర్వసాధారణం అయిపోయింది. మనుషులు ఎదిగినా మెడదు ఎదగడం లేదనడానికి ఇటీవల కాలంలో జరుగుతున్న ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తమ దగ్గర పనిచేసేవారు తమకు బానిసలుగా ఉండాలనే..

Viral Video: సాయం చేసినందుకు చెంపదెబ్బలు.. ఆగ్రహించిన సెక్యూరిటీగార్డులు.. అసలేం జరిగిందంటే..
Slap To Security
Follow us on

Viral News: తమకంటే చిన్నస్థాయి వారి పట్ల చిన్న చూపు చూడటం సర్వసాధారణం అయిపోయింది. మనుషులు ఎదిగినా మెడదు ఎదగడం లేదనడానికి ఇటీవల కాలంలో జరుగుతున్న ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తమ దగ్గర పనిచేసేవారు తమకు బానిసలుగా ఉండాలనే క్రూర మనస్తత్వంలోంచి కొందరు బయటకు రావడంలేదు. స్థాయితో సంబంధం లేకుండా మనమంతా మనుషులమనే కనీస జ్ఞానాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు కొందరు. సాధారణంగా మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు సాయం చేస్తే.. వారి సాయానికి కృతజ్ఞతలు చెప్తాం. కాని కొంతమంది మాత్రం సాయానికి కృతజ్ఞతలు కాదు కదా.. సాయం చేసినందుకు కొట్టడం చూస్తే వ్యక్తుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల నొయిడాలో గేటేడ్ కమ్యూనిటీలో ఓ మహిళ సెక్యూరిటీ గార్డును కొట్టిన ఉదంతం జరిగి 10 రోజులు గడవకముందే ఇలాంటి ఘటన మరొకటి గురుగ్రామ్ లో జరిగింది. గురుగ్రామ్ లోని ద క్లోజ్ నార్త్ సొసైటీలో నివాసం ఉంటున్న వరుణ్ నాథ్ 14వ అంతస్తు నుంచి లిఫ్ట్ లో కిందకి వస్తున్నాడు. ఈసమయంలో లిఫ్ట్ ఆగిపోయింది. సహాయం కోసం లిఫ్ట్‌లో ఉన్న ఇంటర్‌కామ్ ద్వారా సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇచ్చాడు. అశోక్ తనతోపాటు లిఫ్ట్‌మ్యాన్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. లిఫ్ట్ లో ఉన్న వరుణ్‌ని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఐదు నిమిషాల సమయం పట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన వరుణ్ నాథ్ లిఫ్ట్ నుంచి బయటకు రాగానే సెక్యూరిటీ గార్డును, లిఫ్ట్ మ్యాన్ ను చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో ఆగ్రహించిన దక్లోజ్ నార్త్ సొసైటీలోని సెక్యూరిటీ గార్డులంతా సమ్మెకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తతంగమంతా సొసైటీలోని లిఫ్ట్ దగ్గర అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

ఇవి కూడా చదవండి

లిఫ్ట్ లో ఇరుక్కుపోయారన్న విషయం తెలుసుకున్న సెక్యూరిటీగార్డు లిఫ్ట్ మ్యాన్ కు సమాచారం ఇచ్చి వరుణ్ నాథ్ ని బయటకు తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పడం మాని చెంపదెబ్బలు కొట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఘటన తర్వాత సొసైటీలోని సెక్యూరిటీ గార్డులంతా పని చేయడం మానేశారు. సొసైటీ వాసులకు తమ సేవలను అందించేందుకు తాము రాత్రింబవళ్లు కష్టపడుతున్నామని, కొంతమంది మాత్రం తమను బానిసలుగా భావిస్తున్నారని సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు వరుణ్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో గురుగ్రామ్ పోలీసులు నిందితుడు వరుణ్ నాథ్‌పై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 323 (బాధ కలిగించడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..