వెనుక నుంచి దూసుకొచ్చిన మృత్యుశకటం.. కళ్ల ముందే ట్రక్కు చక్రాల కింద నలిగిపోయిన యువతి..!

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణేలోని సుస్ ప్రాంతంలో రెడీ-మిక్స్ కాంక్రీట్ (RMC) ట్రక్కు 18 ఏళ్ల అమ్మాయి ప్రాణం తీసింది. తన ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టడంతో ఆ బాలిక మరణించింది. ఈ సంఘటన సుస్-నాండే రోడ్డులో జరిగింది. ఇందుకు సంబందించి మొత్తం ప్రమాదం CCTV కెమెరాలలో రికార్డైంది.

వెనుక నుంచి దూసుకొచ్చిన మృత్యుశకటం.. కళ్ల ముందే ట్రక్కు చక్రాల కింద నలిగిపోయిన యువతి..!
Rmc Truck Hits Two Wheeler

Updated on: Mar 11, 2026 | 1:12 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (మార్చి 08) సాయంత్రం పూణేలోని సుస్ ప్రాంతంలో రెడీ-మిక్స్ కాంక్రీట్ (RMC) ట్రక్కు 18 ఏళ్ల అమ్మాయి ప్రాణం తీసింది. తన ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టడంతో ఆ బాలిక మరణించింది. ఈ సంఘటన సుస్-నాండే రోడ్డులో జరిగింది. ఇందుకు సంబందించి మొత్తం ప్రమాదం CCTV కెమెరాలలో రికార్డైంది. మృతురాలిని అంజలి శంకర్ సాల్వేగా గుర్తించారు. ట్రక్కు చక్రాల కింద నలిగిపోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించిందని పోలీసులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ప్రమాదం పింప్రి-చించ్‌వాడ్ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో సుస్ గావ్‌లోని శివ్‌బా చౌక్ వద్ద జరిగింది. పోలీసుల కథనాల ప్రకారం, అంజలి తన ద్విచక్ర వాహనంపై సుస్-నాందే రోడ్డులో వెళుతుండగా, వేగంగా వస్తున్న RMC ట్రక్కు వెనుక నుండి వచ్చి ఆమె వాహనాన్ని ఢీకొట్టింది. బలంగా ఢీకొనడం వల్ల, ఆమె బైక్ పై నుండి పడి ట్రక్కు కింద నలిగిపోయింది. తీవ్రంగా గాయపడ్డ అంజలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన బవ్ధాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసుకు సంబంధించి ట్రక్ డ్రైవర్ రాజ్‌పాల్ కస్బేను పోలీసులు అరెస్టు చేశారు. భారీ వాహనాలకు సంబంధించిన భద్రతా నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో సూర్య కన్‌స్ట్రక్షన్ యజమాని గణేష్ కలశెట్టిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. దర్యాప్తులో భాగంగా వాటిని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి…

ఈ సంఘటన సుస్గావ్ ప్రాంత నివాసితులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. రద్దీగా ఉండే రోడ్లపై భారీ నిర్మాణ వాహనాల రాకపోకలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారీ వాహనాలను పర్యవేక్షించాలని కోరుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us