కమలం గుర్తు మీట నొక్కారా.. పాక్‌పై అణుబాంబు వేసినట్లే..

| Edited By: Pardhasaradhi Peri

Oct 14, 2019 | 3:22 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మరోసారి మహా సంగ్రామంలో కమల దళం రెపరెపలాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ నాయకులతో పాటు.. ఇతర రాష్ట్రాల కీలక నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 21న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గుర్తుకు ఓటేస్తే.. […]

కమలం గుర్తు మీట నొక్కారా.. పాక్‌పై అణుబాంబు వేసినట్లే..
Follow us on

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మరోసారి మహా సంగ్రామంలో కమల దళం రెపరెపలాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ నాయకులతో పాటు.. ఇతర రాష్ట్రాల కీలక నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 21న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గుర్తుకు ఓటేస్తే.. మీరు పాకిస్థాన్‌పై అణుబాంబు వేసినట్లేనని అన్నారు. థానే నగరంలో మీరా భయేందర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మెహతాకు మద్దతుగా జరిగిన ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఓటేసి బీజేపీకి పట్టం కట్టాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో కమలం వికసిస్తుందనే నమ్మకం తనకుందని.. ప్రతిపక్షాల గురించి మాట్లాడుతూ లక్ష్మీ దేవత సైకిలు, గడియారంపై కూర్చోదని, ఆ దేవత కమలం పువ్వుపైనే కూర్చుంటుందని చెప్పారు. కమలం పువ్వు అంటేనే అభివృద్ధికి సంకేతమని, అందుకే జమ్ముకశ్మీర్‌కు ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేయగలిగామన్నారు.