స్వామి వివేకానంద జయంతి: జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

మనం జనవరి 12న జాతీయ యుజన దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే, ఆ రోజునే ఈ ఉత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. ఆధునిక ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానందతో ఈ రోజుతో సంబంధం ఏమిటి? యువజన దినోత్సవం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

స్వామి వివేకానంద జయంతి: జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటామో తెలుసా?
Swami Vivekananda

Updated on: Jan 10, 2026 | 4:20 PM

భారతదేశ యువతకు స్ఫూర్తినిచ్చే, దేశాభిమానం, ఆత్మవిశ్వాసం, సేవా భావనలను పెంపొందించే ప్రత్యేకమైన రోజు జాతీయ యువజన దినోత్సవం. ప్రతి సంవత్సరం జనవరి 12న ఈ రోజు ఘనంగా జరుపుకుంటాం. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ రోజున జాతీయ యుజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. స్వామి వివేకానంద 1863 జనవరి 12న జన్మించారు. ఆయన ఆలోచనలు, ఆదర్శాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

ఎందుకు యువజన దినోత్సవం?

యువత దేశ భవిష్యత్తు. ఈరోజు ప్రతి యువతలో సంకల్పం, ధైర్యం, సృజనాత్మకతను పెంపొందించడానికి, సానుకూల ఆలోచనలకు ప్రేరణ ఇవ్వడానికి యువజన దినోత్సవం జరుపుకుంటారు. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే, “యువత దేశానికి శక్తి, యువత మార్పుకు ప్రేరణ” అని స్పష్టంగా తెలియజేశారు. భారతదేశ భవిష్యత్తు దాని యువతరం వ్యక్తిత్వం, విశ్వాసం, ఆలోచనలలో ఉందని వివేకానంద స్పష్టం చేశారు. కాగా, 1984లో భారత ప్రభుత్వం స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. నాటి నుంచి జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం.

స్వామి వివేకానంద స్ఫూర్తి

చికాగోలో ప్రసిద్ధ ప్రసంగం ద్వారా ప్రపంచం ముందు భారతీయతను, ఆత్మవిశ్వాసాన్ని స్వామి వివేకానంద ఇనుమడింపజేశారు. యువతలో సేవాభావం, ధైర్యం, కఠోర పరిశ్రమ, ఆత్మవిశ్వాసం పెంపొందించే సందేశాలు ఇచ్చారు. ఆయన జీవితం సంకల్పం, కృషి, దేశభక్తికు నిత్యప్రేరణగా నిలుస్తుంది.

ఎలా జరుపుకుంటారు?

ప్రతి విద్యాసంస్థలు, యువజన సంఘాలు, సంస్థలు వివిధ రీతులలో ఈ రోజును ఘనంగా జరుపుకుంటాయి. వివేకానంద స్వామి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటారు. ఆయన యువతకు ఇచ్చిన స్ఫూర్తి మంత్రాలను నెమరువేసుకుంటారు. దేశ భవిష్యత్తులో యువత పాత్ర ఎలా ఉండాలని వివేకానందుడు కాక్షించాడో అలాగే ఉండాలని ఆశిస్తారు. ఇంకా, ప్రసంగాలు, సదస్సులు, యోగా, ధ్యాన శిబిరాలు,
డిబేట్, ఎస్సే పోటీలు, సంగీత, నాట్య, సాంస్కృతిక కార్యక్రమాలు, యువతకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు లాంటివి నిర్వహిస్తూ వివేకానందుడి జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.

యువతకు సందేశం..

నేషనల్ యూత్ డే కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు.. యువతలో ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత, దేశాభిమానంను పెంపొందించడానికి ఒక గొప్ప వేదిక. ప్రతి యువత దీన్ని గౌరవంగా, కర్తవ్యం ప్రతిపాదనతో జరుపుకుంటే దేశానికి నిజమైన సేవ అవుతుంది.

ప్రతి యువతకు ఈ రోజు ప్రేరణ, ధైర్యం, లక్ష్య సాధనకు అవకాశం ఇస్తుంది. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత దేశానికి, సమాజానికి సానుకూల మార్పును తీసుకొచ్చేలా ప్రయత్నించాలి.