Amartya Sen : ఆర్థిక వేత్తకు మమత మద్దతు… నాకు బలాన్ని ఇచ్చారని బదులిచ్చిన నోబెల్ పురస్కార గ్రహీత…

కేంద్ర ప్రభుత్వానికి, ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌కు మధ్య వార్ నడుస్తోంది. దీనికి కారణం ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయనను కేంద్రం టార్గెట్ చేసేలా చేశాయి. కాగా ఆయనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి మద్దతు లభించింది.

Amartya Sen : ఆర్థిక వేత్తకు మమత మద్దతు... నాకు బలాన్ని ఇచ్చారని బదులిచ్చిన నోబెల్ పురస్కార గ్రహీత...

Edited By:

Updated on: Dec 29, 2020 | 5:43 AM

కేంద్ర ప్రభుత్వానికి, ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌కు మధ్య వార్ నడుస్తోంది. దీనికి కారణం ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయనను కేంద్రం టార్గెట్ చేసేలా చేశాయి. కాగా ఆయనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి మద్దతు లభించింది.

సమస్య ఎక్కడంటే…

ప్రజలకు నిరసన తెలిపే అవకాశాలు, స్వేచ్ఛగా నిర్వహించుకునే చర్చా వేదికలకు దారులు మూసుకుపోతున్నాయని, ప్రభుత్వానికి నచ్చని వ్యక్తిని ప్రభుత్వమే ద్రోహిగా ప్రకటిస్తూ శిక్షిస్తోందని అమర్త్యసేన్‌ వ్యాఖ్యానించారు. ఆయన మాటలు కేంద్రానికి ఆగ్రహాం తెప్పించాయి. దీంతో ఆయనను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగానే అమర్త్య సేన్‌కు తాతల కాలం నుంచి వస్తున్న ఆస్తి విషయంలో బీజేపీ, కేంద్రం ఆరోపణలు చేస్తుంది. దానికి బలం చేకూర్చేలా…. విశ్వ భారతి విశ్వవిద్యాలయానికి చెందిన భూమి అమర్త్యసేన్‌తో సహా అనేక ప్రైవేటు పార్టీల పేర్లతో తప్పుగా రిజిస్టర్ అయిందని ఆరోపిస్తూ ఆ యూనివర్సిటీ అధికారులు ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. అది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

మమత మద్దతు…

తన ఆస్తికి సంబంధించి నెలకొన్న వివాదంలో తనకు మద్దతుగా నిలిచినందుకు అమర్త్యసేన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని సేన్ ఆస్తి వివాదంపై మమత ఆయనకు లేఖ రాసి… భాజపా ప్రభుత్వ వైఖరిని ఖండించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు చేస్తున్నందునే ఈ ఆర్థిక వేత్తకు సమస్యలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, మమత ఉత్తరంపై స్పందించిన అమర్త్యసేన్ ‘‘మీరు నాకు మద్దతు ఇవ్వడం నా హృదయాన్ని హత్తుకుంది. అంత బిజీ జీవితంలో కూడా మీరు దాడికి గురవుతోన్న వారికి భరోసా ఇవ్వడానికి సమయాన్ని కేటాయించలిగారు. మీ బలమైన గళం, జరుగుతున్న వివాదంపై అవగాహన నాకు బలాన్నిచ్చాయి’’ అని అమర్త్యసేన్‌ బెంగాల్ ప్రభుత్వానికి రాసిన లేఖలో వెల్లడించారు.