Viral Video: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నెమలి.. రక్షించే బదులు ఈకలు పీకిన గ్రామస్థులు! వీడియో

రోడ్డు దాటుతుండగా ఓ వాహనం నెమలిని ఢీ కొట్టింది. దీంతో అది ప్రాణాలతో విలవిలలాడుతుంటే.. అటుగా వెళ్తున్న కొందరు బాటసారులు చూశారు. అంతే పరుగున వచ్చి దానికి ప్రాణాలు పోయడానికి బదులు అత్యంత క్రూరంగా దాని ఈకలు పీక్కుపోయారు. ఈ అమానుష ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది..

Viral Video: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నెమలి.. రక్షించే బదులు ఈకలు పీకిన గ్రామస్థులు! వీడియో
Villagers Pluck Feathers Of Peacock

Updated on: Sep 30, 2025 | 7:03 PM

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 30: రోడ్డు ప్రమాదంలో గాయపడిన నెమలిని కాపాడడానికి బదులు మానవత్వం మరచి నెమలి ఈకలను పెకిలించి మరింత హాని తలబెట్టారు. గ్రామస్థులు ఎగబడి మరీ ప్రాణాలతో కొట్టుకుంటున్న నెమలి ఈకల కోసం పోటీపడ్డారు. ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈకలు పీక్కొని వెళ్లారు. అసలేం జరిగిందంటే..

ఈ వీడియో క్లిప్‌లో.. రోడ్డు దాటుతున్న ఓ నెమలిని వాహనం ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నెమలి కదలలేని స్థితిలో రోడ్డుపై పడిపోయింది. గమనించిన కొందరు వ్యక్తులు గాయపడిన నెమలిని రక్షించే బదులు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. గుంపులుగా చేరి, దాని ఈకలను పీక్కొని వెళ్లారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేది ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడ్డారు. గ్రామస్తుల క్రూరత్వాన్ని ఎండగడుతూ కామెంట్లు పెడుతున్నారు. జాతీయ పక్షి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల రక్షణ చట్టం కింద వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.