ఆడది అబల కాదు సబల.. అవసరం అయితే ఆది పరాశక్తిలా మారుతుంది.. విద్రోహులకు చుక్కలు చూపిస్తుంది.. ఇదే విషయాన్నీ మరోసారి రుజువు చేశారు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు.. బ్యాంక్ లో చోరీ చేయడానికి వచ్చిన ముగ్గురు దొంగలకు చుక్కలు చూపించారు తుపాకీతో బెదిరించినా భయపడకుండా ఎదుర్కొన్నారు. వారి గుండె ధైర్యం చూసి దెబ్బకు దొంగలు తోకముడిచారు. బీహార్ లోని హాజీపూర్ లో జనవరి 18న చోటుచేసుకుందీ ఘటన. హాజీపూర్ లో సర్దార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్తర్ బీహార్ గ్రామీణ్ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంకులో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు జుహి కుమారి, శాంతి కుమారి సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తుంటారు.
జనవరి 18న కూడా ఎప్పట్లానే బ్యాంకు ముందు డ్యూటీలో ఉన్నారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు బ్యాంకు లోపలికి వచ్చారు. వాళ్ల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వారిని ఆరాతీసింది జుహి కుమారి. బ్యాంక్ పాస్ బుక్ చూపించమని అడిగింది. వెంటనే వారిలో ఒక వ్యక్తి రివాల్వర్ బయటకు తీశాడు. వెంటనే అప్రమత్తమైన జుహి, శాంతి తమ తుపాకులతో వారిని అడ్డుకున్నారు. వాళ్లు ముగ్గురు ఉన్నా, చేతిలో రివాల్వర్ ఉన్నా వెనక్కి తగ్గలేదు. ఇద్దరూ కలిసి దొంగలపై కలబడ్డారు. కానిస్టేబుళ్ల దగ్గరున్న తుపాకులను లాక్కోవడానికి దొంగలు విఫలయత్నం చేశారు. అయితే, వీళ్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ ఆడపులలు ముందు తమ పప్పులు ఉడకవనుకున్న ముగ్గురు దొంగలూ తోకముడిచి పారిపోయారు.
The Gallant act of two lady constables of Bihar Police is laudable. Their bravery thwarted an attempt of Bank Robbery in Vaishali.#Bihar_Police_Action_against_Criminal pic.twitter.com/4Do0pQOPAp
— Bihar Police (@bihar_police) January 18, 2023
ఇదంతా బ్యాంకులోని సీసీటీవీ కెమెరాలలో రికార్డయింది. పారిపోయిన దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పడ్డారు పోలీసులు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. దొంగలను ధైర్యంగా ఎదుర్కొని, తరిమికొట్టిన మహిళా కానిస్టేబుళ్లను బ్యాంకు సిబ్బందితో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా మెచ్చుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..