AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: వృద్ధుడి లైఫ్ మార్చేసిన లాటరీ.. ఏకంగా రూ.5కోట్లు.. దేనికైనా టైమ్ రావాలి బాసూ..

లాటరీ.. అందరినీ వరించదు. అందుకు చాలా అదృష్టం ఉండాలి. కానీ చాలా మంది లాటరీ టికెట్లు కొంటుంటారు. తగలకపోతుందా అనే ఆశతో ఉంటారు. ఇలా కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ...

Trending: వృద్ధుడి లైఫ్ మార్చేసిన లాటరీ.. ఏకంగా రూ.5కోట్లు.. దేనికైనా టైమ్ రావాలి బాసూ..
Lottery
Ganesh Mudavath
|

Updated on: Jan 19, 2023 | 2:48 PM

Share

లాటరీ.. అందరినీ వరించదు. అందుకు చాలా అదృష్టం ఉండాలి. కానీ చాలా మంది లాటరీ టికెట్లు కొంటుంటారు. తగలకపోతుందా అనే ఆశతో ఉంటారు. ఇలా కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ లాటరీ అందరికీ వరించదు కదా.. కానీ ప్రస్తుతం ఓ వృద్ధుడికి ఏకంగా రూ.5 కోట్లు లాటరీ తగిలింది. దీంతో అతని ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. పంజాబ్​లోని మొహాలి జిల్లాలో మహంత్ ద్వారకా దాస్ నివాసముంటున్నాడు. అతడి కుమారుడు నరేంద్ర కుమార్ కారు డ్రైవర్​గా పని చేస్తున్నాడు. మహంత్ కు లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం అలవాటు. దీంతో తరచూ టికెట్లు కొనేవాడు.

అలా పంచకుల రోడ్డు సమీపంలో ఉన్న ఓ లాటరీ షాపులో టికెట్ కొన్నాడు. తాజాగా తీసిన లక్కీ డ్రాలో మహంత్​లాటరీ టికెట్​నంబర్​ వచ్చింది. ఈ విషయాన్ని షాపు యజమాని మహంత్ కు తెలిపాడు. రూ. 5 కోట్లు లాటరీ తగిలింది అని చెప్పి పూల మాలల వేసి స్వీట్లు తినిపించాడు. దీంతో ద్వారకా దాస్ ఇంట్లో సందడి నెలకొంది. ఈ విషయం తెలిసుకున్న గ్రామస్థులందరూ మహంత్​ఇంటికి తరలి వస్తున్నారు. అయితే.. పన్నులు అన్నీ పోగా మిగతా డబ్బు మహంత్​కు వస్తుందని లాటరీ షాపు యజమాని తెలిపాడు.

సామాన్యులు.. ఒక్కసారిగా కోటీశ్వరులు కావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదృష్టం తమను వరించకపోతుందా అనే ఆశతో అనేక మంది లాటరీ టికెట్లు కొంటుంటారు. కానీ అందరినీ అదృష్టం వరించదనే విషయాన్ని గుర్తించడం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి