Viral Video: ఛీ.. యాక్‌! రైలు వంటగదిలో ఎలుకల స్వైర విహారం.. రైల్వే అధికారుల స్పందన ఇదే

|

Oct 19, 2023 | 3:01 PM

రైల్వేలలో ఆహారం నాణ్యతపై ఎప్పటి నుంచి ప్రయాణికులు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆహారంలో ఇనుప వస్తువులు, వెంట్రుకలు, బొద్దింకలు వంటి పలు రకాల అపరిశుభ్ర వస్తువులు ఇప్పటికే ఎన్నో సార్లు బయటపడ్డాయి. తాజాగా మరో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. ఆహారంలో అపరిశుభ్రమైన వస్తువులు రావడం మాట అటుంచితే.. రైల్వే ప్యాంట్రీ (వంట గది)లో ఏకంగా ఎలుకలు స్వైర విహారం చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో..

Viral Video: ఛీ.. యాక్‌! రైలు వంటగదిలో ఎలుకల స్వైర విహారం.. రైల్వే అధికారుల స్పందన ఇదే
Rats In Train Pantry
Follow us on

ముంబయి, అక్టోబర్‌ 19: రైల్వేలలో ఆహారం నాణ్యతపై ఎప్పటి నుంచి ప్రయాణికులు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆహారంలో ఇనుప వస్తువులు, వెంట్రుకలు, బొద్దింకలు వంటి పలు రకాల అపరిశుభ్ర వస్తువులు ఇప్పటికే ఎన్నో సార్లు బయటపడ్డాయి. తాజాగా మరో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. ఆహారంలో అపరిశుభ్రమైన వస్తువులు రావడం మాట అటుంచితే.. రైల్వే ప్యాంట్రీ (వంట గది)లో ఏకంగా ఎలుకలు స్వైర విహారం చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కిచెన్‌లోని ఆహారంలో విచ్చల విడిగా తిరుగుతూ, అక్కడి ఆహారం తింటూ ఉన్న వీడియోను టెండూల్కర్ అనే ఓ రైల్వే ప్యాసింజర్‌ తన ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పొస్టు చేసిన సదరు వ్యక్తి అక్టోబర్‌ 15వ తేదీన తన కుటుంబంతో కలిసి 11099 నెంబర్‌ కలిగిన మడగావ్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాడు. తాను సదరు ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఈ షాకింగ్‌ దృశ్యాన్ని చూశానంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఆ రోజు మధ్యాహ్నం 1:45 గంటలకు రైలు బయలుదేరాల్సి ఉండగా.. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలస్యంగా బయలు దేరింది.

ఇవి కూడా చదవండి

దీంతో రైలు వెనుకభాగంలోకి రరైలు ఇంజన్‌ కప్లింగ్‌ వద్దు వెళ్తుండగా అప్పుడే ఈ షాకింగ్‌ దృశ్యం చూశాను. అక్కడ కనీసం 6 నుంచి 7 వరకూ ఎలుకలు సంచరిస్తున్నాయి. వాటిల్లో నాలుగు ఎలుకల వీడియోలను మాత్రమే తీయగలిగాను. రైల్వే కిచెన్‌లో ఆహార పదార్థాలను ఎలుకలు తింటూ కనిపించడం నన్ను బాగా నిరుత్సాహానికి గురి చేసింది. తరచూ రైళ్లలో ప్రయాణించే నాకు ఈ సంఘటన తీవ్రంగా కలచివేసింది’ అని ఆ యూజర్ తెలిపాడు.

ఈ ఘటనపై రైలు ప్రయాణికుడు టెండూల్కర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసుకు తెలిపినా ప్రయోజనం లేకపోయిందని  తెలిపాడు. రైల్వే ట్రాక్‌పై వందలాది ఎలుకలు సంచరిస్తుంటాయని, వాటిల్లో కొన్ని రైళ్లలోకి దూరి ఉండవచ్చని సాధారణంగా మాట్లాడి కొట్టిపారేశాడు. దీంతో అతను అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మీనాకు ఫిర్యాదు చేస్తే ప్యాంట్రీ మేనేజర్‌తో మాట్లాడాలని చెప్పారు. ‘రైలు కోచ్‌లు నాసిరకంగా ఉండటం వల్ల ఎలుకలు ప్రవేశిస్తున్నాయని, ఇండియన్‌ రైల్వేస్‌ ఇలాంటి కోచ్‌లు ఇచ్చింది. దీనిపై మనం మాత్రం ఏం చేయగలం’ అంటూ ఆయన ఆరోపించారంటూ తన పోస్టులో సదరు రైల్వే ప్రయాణికుడు వాపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో ఐఆర్‌సీటీసీ స్పందించింది. ‘ఈ విషయాన్ని మేము సీరియస్‌గా పరిగణిస్తున్నాం. ప్యాంట్రీలో శుభ్రతపై తగు నివారణ చర్యలు తీసుకుంటామని’ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహరం హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.