Viral Video: చిచ్చర పిడుగు.. వయసు చూస్తే మూడేళ్లే.. కానీ నోరు తెరిచిందంటే..

| Edited By: Phani CH

Jun 10, 2021 | 9:46 AM

Viral Video: మనం ఒక పది మంది ఫోన్ నెంబర్లు, పలువురి పేర్లను గుర్తుంచుకోవడానికే నానా తంటాలు పడుతాం. అలాంటిది ఈ చిన్నారి...

Viral Video: చిచ్చర పిడుగు.. వయసు చూస్తే మూడేళ్లే.. కానీ నోరు తెరిచిందంటే..
Viral Pic
Follow us on

Viral Video: మనం ఒక పది మంది ఫోన్ నెంబర్లు, పలువురి పేర్లను గుర్తుంచుకోవడానికే నానా తంటాలు పడుతాం. అలాంటిది ఈ చిన్నారి మాత్రం ఏకంగా ప్రపంచ దేశాలు, వాటి రాజధానుల పేర్లను ఏకబిగిన చెప్పేస్తుంది. పోనీ మరీ పెద్ద అమ్మాయా? అంటే అదీ కాదు. కేవలం మూడేళ్ల వయస్సు కలిగిన ఈ చిన్నారి.. 1.3 నిమిషాల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా 205 దేశాలకు సంబంధించిన రాజధానుల పేర్లను టకా టకా చెప్పేసి అందరినీ షాక్ గురిచేస్తోంది. ఎలాంటి తప్పులు లేకుండా జెట్ స్పీడ్‌తో సమాధానం చెబుతున్న ఈ మూడేళ్ల బాలిక వీడియో ఇంటర్నెట్‌లో పెను సంచలనం గా మారింది.

అసాధారణమైన ప్రతిభ కలిగిన ఈ చిన్నారి పేరు ప్రణినా. ఈమె తండ్రి ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ ఉద్యోగి. కాగా, ఈ చిన్నారి వీడియోను ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ ప్రియాంక శుక్త ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా మరింత వైరల్‌గా మారింది. కాగా, ‘‘మీకు ఎన్ని దేశాల రాజధానులు తెలుసు?’’ అంటూ ఐఏఎస్ అధికారిణి తన ట్వీ్ట్‌కు క్యాప్షన్ పెట్టింది. ప్రణినా జ్ఞాపక శక్తి మొదటి నుంచి అసాధారణమైనదని టాండన్ వివరించినట్లు ఆమె పేర్కొ్న్నారు.

కాగా, చిన్నా ప్రతిభను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అమ్మాయిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే, ఈ విషయ పరిజ్ఞానం కోసం చిన్నారిపై ఒత్తిడి చేయొద్దంటూ మరికొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే.. భవిష్యత్ ఐఏఎస్ ఆఫీసర్ అంటూ జోస్యం చెప్పేస్తున్నారు.

Also read:

Sensational revelation : హత్య కేసులో మరో కొత్త కోణం.. అమ్మాయి కోసం హత్య చేశారా..! కారణం అదేనా?