
మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించినప్పటి నుండి, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం నిండిపోయింది. వీటిలో ఎక్కువగా పాకిస్తాన్ ఆధారిత ఖాతాలే ఉన్నాయి. పాకిస్తాన్ సోషల్ మీడియా ఖాతాలు ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫెల్ యుద్ధ విమానాన్ని పాకిస్థాన్ కూల్చేసినట్లు, రఫెల్ పైలెట్ అంత్యక్రియలు నిర్వహించినట్లు ఓ ఫొటో వైరల్ అవుతోంది.
ప్రౌడ్ పాకిస్తానీ అనే యూజర్ ఫోటోను షేర్ చేసి “మే 7న PAFతో జరిగిన ఘర్షణలో మరణించిన రఫెల్ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ రోహిత్ కటారియా (32292)కి చెందిన అంతిమ్ సంస్కార్ ఈరోజు ధర్మశాలలో చేశారు.” అని రాశాడు. అయితే దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్-చెక్ యూనిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో ఫేక్ అని లేల్చింది. ఇది వాస్తవానికి 2008 నాటి వీడియో అని పేర్కొంది. PIB అసలు చిత్రానికి లింక్‌ను కూడా పంచుకుంది. ఆపరేషన్ సిందూర్‌తో దీనికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 16, 2008న ఓర్సాంగ్ నది ఒడ్డున నర్మదా కాలువలోకి బస్సు పడిపోవడంతో విషాదకరంగా మునిగిపోయిన 15 మంది పాఠశాల బాలికల సామూహిక దహన సంస్కారాల సమయంలో గుజరాత్‌లోని ప్రజలు నివాళులు అర్పిస్తున్నట్లు ఆ ఫోటోలో ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత రఫెల్ పైలట్ కోల్పోలేదని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడి తర్వాత పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని భారత వైమానిక దళం గతంలో తెలిపింది.
An old image is going viral on social media, with many Pakistan-based accounts claiming that it shows the last rites of a Rafale pilot of the #IndianAirForce who died on 7 May 2025.#PIBFactCheck
❌ This claim is completely fake.
✅ The image is actually from 2008 and… pic.twitter.com/bud4awxcRP
— PIB Fact Check (@PIBFactCheck) May 14, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..