Doctor Humanity: తండ్రిని రైల్వే స్టేషన్‌లో వదిలేసిన కొడుకు.. బిక్షాటన చేసుకుంటున్న వృద్దుడిని కాపాడిన డాక్టర్..

|

Dec 03, 2022 | 11:02 AM

తమ వైద్య వృత్తిని.. వృత్తిగా కాకుండా అదొక గొప్ప మానవసేవగా భావించే వారు ఈరోజుల్లో కూడా ఉన్నారు. అలాంటి ఓ వైద్యుడిని వదిలి పోలేనంటూ ఓ వృద్ధుడు వేడుకోవడం ఆ ఆస్పత్రి వర్గాలందరినీ కదిలించింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

Doctor Humanity: తండ్రిని రైల్వే స్టేషన్‌లో వదిలేసిన కొడుకు.. బిక్షాటన చేసుకుంటున్న వృద్దుడిని కాపాడిన డాక్టర్..
Patient And Doctor Love In Karnataka
Follow us on

దేవుడి మానవ జన్మనిస్తే.. ఇలలో మనిషికి ప్రాణం పోసేది డాక్టర్.. అందుకనే వైద్యుడిని దైవంతో పోలుస్తారు. ఎందుకంటే దేవుడి తర్వాత ప్రాణం పోసే శక్తి ఒక్క డాక్టర్‌కి మాత్రమే ఉంటుంది. అంతటి పవిత్రమైన వైద్య వృత్తి కూడా కాలంలో వచ్చిన మార్పుల్లో వ్యాపారంగా మారిపోయింది అని అనేక సంఘటల ద్వారా తెలుస్తూనే ఉంది. అయితే నేటికీ కొంతమంది.. మాత్రం తమ వైద్య వృత్తిని.. వృత్తిగా కాకుండా అదొక గొప్ప మానవసేవగా భావించే వారు ఈరోజుల్లో కూడా ఉన్నారు. అలాంటి ఓ వైద్యుడిని వదిలి పోలేనంటూ ఓ వృద్ధుడు వేడుకోవడం ఆ ఆస్పత్రి వర్గాలందరినీ కదిలించింది. ఈ హృదయాన్ని హత్తుకునే ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కర్నాటక బీదర్‌ జిల్లాకు చెందిన రాజురామ్‌ గౌడ అనే వృద్ధుడిని అతని కుమారుడు మూడేళ్ల క్రితం నిర్దాక్షిణ్యంగా మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని రైల్వే స్టేషన్‌లో వదిలి వెళ్లిపోయాడు. దాంతో అతను దిక్కుతోచని స్థితిలో అక్కడే భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా అనారోగ్యం పాలయ్యాడు. ఆరోగ్యం దెబ్బతిని కదలలేని స్థితిలో పడిఉన్నాడు. అతడిని గమనించిన స్థానిక డాక్టర్‌ బాలాసాహెబ్‌ శిందే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేశారు. వృద్ధుడికి అన్ని ఆరోగ్య పరీక్షలు చేసి, పూర్తిగా కోలుకునే వరకు ఎంతో శ్రద్ధగా, ప్రేమగా వైద్యం చేశారు. దాదాపు 27 రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాడు ఆ వృద్ధుడు. అతను పూర్తిగా కోలుకున్నాక అతనిని డిశ్చార్జ్‌ చేశారు ఆస్పత్రి సిబ్బంది.

దాంతో ఆ వృద్ధుడు కన్న కొడుకు కన్నా ఎక్కువగా తనకు సేవ చేసిన ఆ వైద్యుడిని, ఆస్పత్రిని వదిలి వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలో తాను ఈ ఆస్పత్రిని, డాక్టర్‌ను, అక్కడివారిని వదిలి వెళ్లలేనని డాక్టర్‌ బాలాసాహెబ్‌ ముందు బావురుమన్నాడు. ఆ పెద్దాయన విన్నపం విన్న అక్కడివారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత అతనికి నచ్చజెప్పి దర్గరుండి ఓ ఆశ్రమంలో చేర్పించారు. ఆస్పత్రి, డాక్టర్‌ను వదిలి వెళ్తున్న సమయంలో ఆ వృద్ధుడు కన్నీటితో అక్కడినుంచి కదిలాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..