Viral News: 17 ఏళ్ల యువకుడికి 82 దంతాలు.. షాకైన డాక్టర్లు!

|

Jul 14, 2021 | 9:50 PM

మనుషులకు 32 పళ్లు ఉంటాయని మనకు తెలిసిందే. అయితే కొందరికి కొంచెం ఎక్కువగా లేదా తక్కువగా ఉండొచ్చని అప్పుడప్పుడు వింటుంటాం.

Viral News: 17 ఏళ్ల యువకుడికి 82 దంతాలు.. షాకైన డాక్టర్లు!
17 Year Old Teenager With Rare Tumour Has 82 Teeth
Follow us on

Rare Tumor: మనుషులకు 32 పళ్లు ఉంటాయని మనకు తెలిసిందే. అయితే కొందరికి కొంచెం ఎక్కువగా లేదా తక్కువగా ఉండొచ్చని అప్పుడప్పుడు వింటుంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయో వ్యక్తికి ఉన్న దంతాలు వింటే షాకవుతారు. నిజమేనండి.. ఆ వ్యక్తికి 40, 50 కాదు ఏకంగా 82 దంతాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌ రాష్ట్రంలో జరిగింది. పాట్నాకు చెందిన నితీష్‌ కుమార్‌ అనే 17 ఏళ్ల వ్యక్తికి 82 పళ్లు ఉన్నాయి. కాగా, నితీష్ 5 ఏళ్లుగా నోటిలో కణితితో బాధపడుతున్నాడు. దీని బాధ ఎక్కువగా ఉండటంతో డెంటిస్ట్ వద్దకు వెళ్లాడు. దీంతో నితీష్‌కి పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లకు షాక్ తగిలింది. దవడలో 82 పళ్లు ఉండడం చూసి ఆశ్చర్యపడడం డాక్టర్ల వంతైంది. ఈ 82 దంతాల వల్లే నితీష్‌కి దవడ నొప్పిగా ఉంటుందని డాక్టర్లు తెలిపారు. దవడలో ఏర్పడిన ట్యూమర్​వల్లే పళ్లన్నీ ఒకే దగ్గర భారీగా పుట్టుకొచ్చాయని వారు వెల్లడించారు.

దీనిని `ఒడొంటొమా` అంటారని డాక్టర్లు తెలిపారు. అన్ని పరీక్షల తరువాత నితీష్‌కు మూడు గంటలపాటు ఆపరేషన్​ చేశారు. ట్యూమర్​ని తొలగించి, దంతాలను తీసేశారు. అయితే, కణిత రెండు దవడలకు వ్యాపించడంతో నితీశ్ రూపం వికృతంగా కనిపించేది. డాక్టర్లు సర్జరీ చేయడంతో నితీష్ ముఖం సాధారణంగా వచ్చిందని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.

Also Read:

Viral Pic: ఇదేంటి.! మెస్సీ, రొనాల్డో చిత్రాలు బీడీ ప్యాకెట్లపైనా.. వైరల్‌ అవుతున్న పోస్ట్‌..

Kudi Yedamaithe: అమలపాల్ ప్రధాన పాత్రలో నటించిన కుడి ఎడమైతే ట్రైలర్ లాంచ్ లైవ్ వీడియో..