కేరళలోని తిరువనంతపురంలోనున్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ).. 66 సైంటిస్ట్/ ఇంజినీర్(ఎస్‌డీ, ఎస్‌సీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సైంటిస్ట్/ఇంజినీర్ (ఎస్‌డీ) పోస్టులకు అట్నాస్పెరిక్ సైన్స్/స్పేస్ సైన్స్/ప్లానెటరీ సైన్స్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో మెటల్ ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్/ఎక్స్పరిమెంటల్ కోల్డ్ అటోమ్స్ స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ఇక సైంటిస్ట్/ఇంజినీర్ (ఎస్‌సీ) పోస్టులకు కెమికల్ ఇంజనీరింగ్/కెమికల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్/కెమిలక్ సైన్ అండ్ టెక్నాలజీ/కెమకల్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ పాసై ఉండాలి. మెకానికల్ డిజైన్/అప్లైడ్ మెకానికల్, ప్రొపల్షన్ ఇంజనీరింగ్/ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ తత్సమాన స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్ పాసై ఉండాలి.
స్పేస్ సైన్స్, ప్లానటరీ సైన్స్, కంట్రోల్ గైడెన్స్ అండ్ నేవిగేషన్, సిస్టమ్స్ ఇంజినీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్,ఎక్స్‌పరిమెంటల్ కోల్డ్ ఆటమ్స్, అప్లైయిడ్ మెకానిక్స్, మెషిన్ డిజైన్, ప్రపల్షన్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లోని వివరణాత్మక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్‌లో జులై 21, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి సైంటిస్ట్ /ఇంజనీరింగ్ లెవల్ 10 పోస్టులకైతే నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 జీతంగా చెల్లిస్తారు. సైంటిస్ట్ /ఇంజనీరింగ్ లెవల్ 11 పోస్టులకు నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.