
భారీ వర్షాలకు ఢిల్లీ తల్లడిల్లిపోయింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేంతవరకు కురిసిన వర్షాలకు అనేక చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. ముఖ్యంగా మురికివాడల్లోని ఇళ్ళు, సగం కట్టిన భవనాలు నీటి ధాటికి కళ్ళముందే కూలిపోయాయి. ఓ స్లమ్ ఏరియాలో డ్రైనేజీ నీటితో కలిసి పొంగిపొరలుతున్న కాలువలో శిథిల గృహాలు కొన్ని పడిపోయాయి. ఓవర్ ఫ్లో అవుతున్న సీవేజీ డ్రైన్ వాటర్ తో ఓ బేస్ మెంట్ ఏరియా నిండిపోగా …భవన భాగాలు నీటిలో పడి కొట్టుకుపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ వంటి మహానగరంలోనే ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని స్థానికులు చెప్పారు. స్పాట్ లో సహాయక బృందాలు, ఫైర్ ఇంజన్ సిబ్బంది ఉన్నా ప్రేక్షక పాత్ర వహించారని వారు అన్నారు. మరో చోట మింటో బ్రిడ్జి కింద పారుతున్న నీటిలో ఓ వ్యక్తి మృత దేహం తేలియాడుతూ కనిపించింది. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
दिल्ली के आईटीओ के पास अन्ना नगर में पानी में कई मकान बह गए ,बारिश के पहले न नाले साफ हुए सीवर,इसलिए ये हाल है,राजधानी की इससे बदतर हालत क्या हो सकती है pic.twitter.com/Oq66qV7xD7
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 19, 2020