ఇటీవల ఘజియాబాద్‌లో జిమ్ ట్రైనర్ కుర్చీలోనే ప్రాణాలు వదిలిన ఘటన మరువకముందే అలాంటి తరహాలోనే మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పంటి నొప్పితో దంతవైద్యుని వద్దకు వెళ్లిన 61 ఏళ్ల వృద్ధుడు కుప్పకూలి మృతి చెందాడు.ఈ విషాద సంఘటన రాజస్థాన్ బర్మేల్‌లో చోటు చేసుకుంది. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా, మృతి చెందిన వ్యక్తిని దిలీప్ కుమార్ మదానీ (61)గా గుర్తించారు. పంటి నొప్పి సమస్యతో ఒక వ్యక్తి దంత వైద్యుడు వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో కుర్చీలో కూర్చుని తన వంతు కోసం వేయిట్ చేస్తూ.. పక్కనే ఉన్న న్యూస్ పేపర్ తీసుకుని చదువుతున్నాడు. ఆ తర్వాత ఒక్క నిమిషం వ్యవధిలోనే అస్వస్థతకు గురయ్యాడు. ఈ సమయంలో, క్లినిక్ సిబ్బంది దిలీప్ కుమార్‌కు సహాయం చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక ఆ వ్యక్తి తుది శ్వాస విడిచాడు.
ఈ ఘటనకు సంబంధించిన మొత్తం దృశ్యాలు క్లినిక్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దిలీప్ కుమార్ మదానీ గార్మెంట్స్ నడుపుతూ గుజరాత్‌లోని సూరత్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, నవంబర్ 4న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బార్మర్‌కు వచ్చారు. పంటినొప్పి రావడంతో నవంబర్ 5న క్లినిక్ కి వెళ్లి..టెస్ట్ చేయించుకున్నారు. అయితే డాక్టర్‌ని కలవకముందే స్పృహ కోల్పోయి నేలపై కుప్పకూలిపోయాడు.
इस तरह की घटनाएं चिंता बढाने वाली है। पचपदरा (बाड़मेर) निवासी दिलीप जी जैन अचानक अखबार पढ़ते पढ़ते चल बसे।
कोरोना के बाद लगातार ऐसी घटनाएं बढ़ रही है।#Rajasthan pic.twitter.com/SoUNn4D4mV— Vivek Shrivastava (@Viveksbarmeri) November 6, 2022
ఈ ఘటనపై క్లినిక్ యజమాని డాక్టర్ కపిల్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. దిలీప్ కుమార్ మదానీ కుటుంబంతో మాట్లాడకుండా తాను ఏమీ చెప్పలేనని అన్నారు. వ్యక్తి కుప్పకూలిన వెంటనే, క్లినిక్ సిబ్బంది అతన్ని టాక్సీలో ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక మృతి చెందినట్లు వారు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి