Watch Video: మేమున్నాం.. ఎముకలు కొరికే చలిలో.. నిండు గర్భిణిని కాపాడిన సైనికులు..
Army Helps Pregnant Woman: ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జమ్మూ కాశ్మీర్‌లో మంచు తీవ్రంగా కురుస్తోంది. ఎముకలు కొరికే చలిలో
Army Helps Pregnant Woman: ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జమ్మూ కాశ్మీర్‌లో మంచు తీవ్రంగా కురుస్తోంది. ఎముకలు కొరికే చలిలో మన సైనికులు దేశం కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఏ చిన్న ఆపద వచ్చినా మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. తాజాగా.. నెలలు నిండిన గర్భిణిని సైనికులు కాపాడారు. గడ్డకట్టే చలిలో నడవడానికి కూడా కష్టమైన అటవీ ప్రాంతంలో సైనికులు గర్భిణి స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన జమ్ము కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ వీడియోను ఆర్మికి చెందిన చినార్ కార్ప్స్ సైనికులు పోస్ట్ చేశారు.
బారాముల్లా జిల్లా పరిధిలోని రామ్‌నాగ్రి ఘజ్జర్ లోయలో నెలలు నిండిన గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు సాయంకోసం అభ్యర్థించారు. దీంతో హుటాహుటిన మంచులో బయలుదేరిన చినార్ ఆర్మీ మెడికల్ బృందం.. గర్భిణి ఉన్న ప్రాంతానికి చేరుకొని స్ట్రెచర్ పై సురక్షితంగా తరలించారు.
#Chinarwarriors got a distress call from Ramnagri in #Shopian for urgent medical assistance for a pregnant lady. In heavy snowfall, evacuation team carried the lady on a stretcher & brought her to District Hospital #Shopian. Family blessed with a baby boy.#Kashmir@adgpi pic.twitter.com/Z1VGSAnnnk
— Chinar Corps? – Indian Army (@ChinarcorpsIA) January 9, 2022
అనంతరం షోపియాన్‌లోని జిల్లా ఆసుపత్రికి చేర్చి వైద్యం త్వరగా అందేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘజ్జర్ హిల్స్ నుంచి సలాసన్ వరకు మొత్తం 6 కిలో మీటర్ల పాటు గర్భిణిని మోసినట్లు తెలిపారు.
తీవ్రమైన హిమపాతం, ప్రతికూల వాతావరణంలో ఏమాత్రం చలించకుడా భారత జవాన్లు చూపిన చొరవకు స్థానికులు, బాధితురాలి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. మహిళకు పండండి మగ శిశువుకు జన్మనిచ్చినట్లు చినార్ కార్ప్స్ తెలిపింది. అయితే ఆర్మీ సైనికుల సాహసానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read: