P Chidambaram: చిదంబరం గో బ్యాక్‌.. సొంత పార్టీ లాయర్ల నుంచే నల్లజెండాలతో నిరసన..

|

May 04, 2022 | 8:40 PM

ఆయన కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత. కేంద్ర మాజీ మంత్రి. ప్రముఖ లాయర్‌. కానీ, నల్లకోటు వేసుకుని కోర్టుకు వచ్చిన ఆయనకు సొంత పార్టీ లాయర్ల నుంచే నల్లజెండాలతో నిరసన ఎదురైంది.

P Chidambaram: చిదంబరం గో బ్యాక్‌.. సొంత పార్టీ లాయర్ల నుంచే నల్లజెండాలతో నిరసన..
P Chidambaram
Follow us on

పి.చిదంబరం(P Chidambaram) కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌. వాదనా పటిమ ఉన్న లీడర్‌ అండ్‌ లాయర్‌. పాలిటిక్స్‌లోనే కాదు కోర్టులోనూ ఆర్గ్యుమెంట్‌లో ఆరితేరిన నాయకుడు. హై ప్రొఫైల్‌ కేసులు టేకప్‌ చేస్తుంటారు. అలాగే ఓ కీలకమైన కేసులో వాదించడానికి ఒప్పుకున్నారు. అది పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన మెట్రో డెయిరీ కేసు. ఇది రాజకీయాలతో ముడిపడిన ఇష్యూ. ఇలాంటి కేసులో ఆగ్రో ప్రాసెసింగ్‌ సంస్థ అయిన కెవెంటర్‌ తరఫున వాదిస్తున్నారు చిదంబరం. ఇదే చిదంబరానికి కాంగ్రెస్‌లో ఓ వర్గం లాయర్లు నిరసన తెలుపడానికి కారణమైంది. ఎందుకంటే కెవెంటర్‌ అనే ప్రైవేటు సంస్థకు మెట్రో డెయిరీలో షేర్లు అమ్మింది మమతా బెనర్జీ ప్రభుత్వం. దీనిపై బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అధిర్‌ రంజన్‌ న్యాయ పోరాటం చేస్తున్నారు.

సొంత పార్టీ నేత అధిర్‌ రంజన్‌ ఎవరికైతే వ్యతిరేకంగా పోరాడుతున్నారో చిదంబరం వాళ్ల పక్షం వహించడం ఏమిటని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన లాయర్లు ప్రశ్నిస్తున్నారు. కోల్‌కతా హైకోర్టు వద్ద చిదంబరానికి వాళ్లు నల్లజెండాలు చూపుతూ నిరసన తెలిపారు. గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. మమతా బెనర్జీకి చిదంబరం ఏజెంట్‌ అని ఆరోపించారు. మెట్రో డెయిరీ ప్రభుత్వ రంగ సంస్థ.

ఇవి కూడా చదవండి

దాని వాటాల విక్రయంలో అవకతవకలు జరిగాయన్నది అధిర్‌ రంజన్‌ ఆరోపణ. సీబీఐ విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు. ప్రొఫెషనల్‌ ప్రపంచంలో ఎవర్ని డిక్టేట్‌ చేయలేమని, ఏ కేసు వాదించాలన్నది వాళ్ల ఇష్టమన్నారు అధిర్‌ రంజన్‌. అయితే చిదంబరానికి ఎదురైన నిరసన సెగ సహజమేనని వ్యాఖ్యానించారు. చిదంబరం నిర్ణయం మాత్రం బెంగాల్‌ కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు.