అతని ఆటో చూస్తే కదిలే ఓ ‘మినీ హౌస్’ లా కనిపిస్తుంది. కారణం ? ఇందులో అన్నీ ఉన్నాయి. మినీ టీవీ, ఫ్రిజ్, ఛార్జింగ్ పాయింట్, శానిటైజర్లు, వార్తా పత్రికలు, ఐ ప్యాడ్, ఇంకా స్నాక్స్..ఇలా ఒకటేమిటి..ప్రజల దైనందిన కార్యకలాపాలకు అవసరమయ్యేవన్నీ ఈ ఆటోలో ఉన్నాయి. చెన్నైలో ఈ హైటెక్ ఆటోను చూసి ఆశ్చర్యపోని వాళ్ళు లేరు. అతడిని అంభినందించని వాళ్ళు అంతకన్నా లేరు. ఇంత అధునాతనంగా తన వాహనాన్ని మార్చిన ఆటో డ్రైవర్ అన్నాదురై అందరికీ ఆప్తుడైపోయాడు. ‘హ్యుమన్స్ అఫ్ బాంబే అనే సంస్థ ఇతని ఆటోను వెలుగులోకి తెచ్చింది. ‘ఆటో అన్న’ గా పిలిచే ఈ అన్నాదురై జీవితం పూలపాన్పేమీ కాదు.. తన కుటుంబ పేద పరిస్థితుల కారణంగా తాను ఎక్కువగా చదువుకోలేకపోయానని, మధ్య లోనే చదువు ముగించాల్సి వచ్చిందని అంటున్నాడు. బిజినెస్ మన్ కావాలనుకున్న తాను ఆటో డ్రైవర్ అయ్యానని చెబుతున్నాడు. కానీ ప్రపంచంలోనే అధునాతనమైన ఆటోను రూపొందించాలన్న తన కల మాత్రం నెరవేరిందన్నాడు.
అన్నాదురై ఆటోను, ఇతని దీన గాథను హ్యుమన్స్ ఆఫ్ బాంబే వీడియో రూపంలో సోషల్ మీడియా దృష్టికి తెచ్చింది. అయితే ఇంత జరిగినా తన కాళ్ళమీద తాను నిలబడగలిగానని అన్నాదురై ధీమాగా చెబుతున్నాడు. తన ఆత్మవిశ్వాసమే తనను ముందుండి నడిపిస్తుందని పేర్కొంటున్నాడు. ఇన్ని హంగులతో తన ఆటోను మార్చడానికి తనకు సొమ్ము ఖర్చయిందని, కానీ ఇందుకు తానేమీ బాధ పడడం లేదని అన్నాదురై చెప్పాడు. నా ఆటో ఎక్కి నన్ను అభినందించే వారే నా దేవుళ్ళు అని వినమ్రంగా అంటున్నాడు.
#ItsViral | iPad, TV, snacks- This Chennai autowala has it all in his vehicle. Here’s why
https://t.co/XZzHnx3gzK— Hindustan Times (@htTweets) July 20, 2021
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : బె ‘జోష్’…అంతరిక్షయాత్ర దిగ్విజయం..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
తండ్రిని…ఏం కాక పడుతుంది ఛార్మి !ఎందుకు అనుకుంటున్నారా..?చివరికి ఎం అయ్యింది..:Charmy Kaur Video.